యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. చేసేది తప్పు అని తెలిసినా చెప్పేవారు లేక, తమను పర్యవేక్షించేవారు లేక ప్రమాదకర మత్తు వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రం నడిబొడ్డున యువత మత్తు కోసం ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల జరిగే అనర్ధాలను కూడా ఆలోచించకుండా మత్తు కోసం, కిక్కు కోసం ప్రమాదం అంచుల్లో అడుగిడుతున్నారు.
జిల్లా కేంద్రంలోని మునప్ప కాలనీ చెట్లపొదలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బహిర్గతమవుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో లేదా రేడియో, ఎలక్ట్రానిక్, వాచ్ ఆటోమొబైల్స్ లో పనిచేసేవారు ఓ జిగురు లాంటి పదార్థాన్ని వస్తువులను అతికించడానికి వాడుతుంటారు. వీళ్ళతోపాటు మెటల్ వుడ్ గ్లాస్ ఫ్యాబ్రిక్ లలో వాడే జెల్ క్యూబ్ లను కూడా వాడుతారు.
అయితే నారాయణ పేట జిల్లా కేంద్రంలో కొంతమంది యువత మత్తు కోసం ఈ గమ్ లను వినియోగిస్తున్నారు. ట్యూబ్ లోని గమ్ వాసన పీల్చడం లేదా శరీరంలోకి తీసుకోవడం చేస్తే మంచికిక్కి ఉంటుందని భావించి యువత ఈ వ్యసనానికి బానిసలవుతున్నారు. ఎక్కువగా జిల్లా కేంద్రంలోని బాబూనగర్ బిసి కాలనీ ప్రాంతాలతో పాటు కూలి పని చేసే యువత వ్యసనానికి అలవాటు పడ్డట్లు తెలుస్తుంది. జిల్లా కేంద్రంలో మొనప్ప కాలనీ మిషన్ భగీరథ ట్యాంక్ వంటి ప్రాంతాల్లోని ఈ వ్యసనానికి అడ్డాగా ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని తెలిసికూడా యువత చెడు వ్యసనానికి పాల్పడుతూ అనారోగ్య పాలవుతున్నారు.
తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై శ్రద్ధ వహించాలని దీనితోపాటు బాపునగర్ బిసి కాలనీ ప్రాంతంలో పోలీసులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ చెడు వ్యసనాలకు బానిస అవడం భవిష్యత్తులో పోయిన ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. మత్తు పదార్థాలుఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు త్వరితగతిన సంభవిస్తాయి.
అప్పుడు ఏర్పడినటువంటి వ్యాధికి చికిత్సలు చేసేందుకు వినియోగించే మెడిసిన్స్ కూడా పనిచేయవని డాక్టర్లు చెప్తున్నారు. సాధ్యమైనంతవరకు పిల్లలు చెడు వ్యసనాలు పడగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులని చెబుతున్నారు. ఇలాంటి చెడు వ్యాసనాలవల్ల చాలా వరకు జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana