Home /News /telangana /

NAGAR KURNOOL YOUNG FARMERS DIED IN NAGARKURNOOL AFTER PESTICIDE SHOED EFFECT ON HIS HEALTH BRV ABH NNK

Nagarkurnool: పొలానికి పిచికారీ చేసిన మందు దుష్ప్రబావంతో యువ రైతు మృతి

రైతు పై తీవ్ర దుష్ప్రబావం చూపడంతో అది తట్టుకోలేక యువ రైతు మృతి

రైతు పై తీవ్ర దుష్ప్రబావం చూపడంతో అది తట్టుకోలేక యువ రైతు మృతి

చికిత్స పొందుతూ యువ రైతు మృతి: పొలానికి పిచికారీ చేసిన మందు... రైతు పై తీవ్ర దుష్ప్రబావం చూపడంతో అది తట్టుకోలేక యువ రైతు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో చోటుచేసుకుంది

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India
    (N.Naveen Kumar, News 18, NagarKurnool)

    చికిత్స పొందుతూ యువ రైతు మృతి: పొలానికి పిచికారీ చేసిన మందు... రైతు పై తీవ్ర దుష్ప్రబావం చూపడంతో అది తట్టుకోలేక యువ రైతు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మప్ప (30) 15 రోజుల క్రితం పంటలకు పురుగుమందు పిచికారి చేసి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తిమ్మప్పను కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిమ్మప్ప పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. తిమ్మప్ప తండ్రి లింగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అమ్మపల్లి గ్రామ సర్పంచ్ రమేష్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గొల్ల రాములు (28) గత కొంతకాలంగా ఆర్ధికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఈక్రమంలో మనస్థాపానికి గురైన రాములు శనివారం రాత్రి ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల స్థానికులు గమనించి... రాములుని వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.



    పాముకాటుతో బాలిక మృతి: ఇంట్లో నిద్రిస్తున్న బాలికను పాము కాటు వేయడంతో మృతి చెందిన ఘటనమహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధి సుగురు గడ్డ తండాకు చెందిన సరోజ, రమేష్ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.రెండవ కుమార్తె శృతి (8) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందింది.

    Read This; Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో పెరుగుతున్న పాముకాటు ఘటనలు: పాము కాటుతో మహిళ మృతి
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

    తదుపరి వార్తలు