హోమ్ /వార్తలు /తెలంగాణ /

డ్యుయల్ టాలెంట్ అంటే వీళ్లదే..! ఆడుతూ ఆడిస్తారు.. శభాష్ అనాల్సిందే..!

డ్యుయల్ టాలెంట్ అంటే వీళ్లదే..! ఆడుతూ ఆడిస్తారు.. శభాష్ అనాల్సిందే..!

X
నాగర్

నాగర్ కర్నూల్ లో అదగొడుతున్న వ్యాయామ టీచర్లు

జాతీయస్థాయి మహిళ మాస్టర్స్ అథ్లెంటిక్ పోటీల్లో సత్తా చాటుతున్నారు ప్రభుత్వ పాఠశాలల వ్యాయామ టీచర్లు.. వీరిలో ఒకరు నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) మహిళ వ్యాయామ ఉపాధ్యాయులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Mahbubnagar | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

ఈ ఆధునిక కాలంలో కూడా ఆడపిల్లలను ఇంటికే పరిమితం అని చూసే తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి వారికి ఆ పాఠశాలలవ్యాయమ ఉపాధ్యాయురాళ్లే ఆదర్శం. చదువు ఒక్కటే ఉంటే సరిపోదు. ఆట, పాట కూడా అవసరమేనంటరు ఆ టీచర్స్. చదువు జ్ఞానం ఇస్తే.. ఆట, పాట మనసుకు ఉల్లసాన్నిస్తుంది అంటారు. నేటి కాలంలో ఆడ, మగ తేడాలుండకుండా అన్ని రంగాల్లోను రాణిస్తేనే భవిష్యత్ బాగుంటుందంటున్నారు. ఆ స్కూల్ విద్యార్థులకు రన్నింగ్, కబడ్డీ, ఖో,ఖో వంటి క్రీడల్లో శిక్షణనిస్తూ.. తాముకూడా వివిధ క్రీడల్లో పాల్గొని.. ఇటు పాఠశాలకు తమ కెరీర్ కు బంగారు బాటలు వేసుకుంటున్నార. అసలు ఈ వ్యాయామ టీచర్ల శిక్షణ తీరు చూస్తే ఆశ్చర్యపోతారు... మీరే చూడండి

జాతీయస్థాయి మహిళ మాస్టర్స్ అథ్లెంటిక్ పోటీల్లో సత్తా చాటుతున్నారు ప్రభుత్వ పాఠశాలల వ్యాయామ టీచర్లు.. వీరిలో ఒకరు నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) మహిళ వ్యాయామ ఉపాధ్యాయులు. నేషనల్ ఉమెన్స్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మహిళ వ్యాయామ ఉపాధ్యాయులు సత్తా చాటారు. మణి జడ్.పి.హెచ్.ఎస్ బల్మూరు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు లాంగ్ జంప్ లో రెండవ బహుమతి, డి సుభాషిని శ్రీపురం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు 4×100 మీటర్స్ రన్నింగ్లో రెండోవ బహుమతి, చంద్రకళ వ్యాయామ ఉపాధ్యాయురాలు మన్ననూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జావిల్లింగ్ త్రోలో రెండో బహుమతి సాధించింది.అదేవిధంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొల్లాపూర్ లక్ష్మి వ్యాయామ ఉపాధ్యాయురాలు లాంగ్ జంపులో మొదటి బహుమతి సాధించారు.

ఇది చదవండి: ఒడిత సాయంతో రాయి పెట్టి కొడితే కోతులు పరార్.. అసలు ఒడిత అంటే తెలుసా..?

వీరంతా తాముపనిచేస్తున్న పాఠశాలల్లో విద్యార్థినీలకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ఆడేలా కృషి చేస్తున్నారు.రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేలాశిక్షణలు అందిస్తున్నారు. 800 మీటర్ పోటీలో సత్తా చాటిన వ్యాయమ ఉపాధ్యాయులు డి. శుభాషిణితో న్యూస్ 18 ప్రత్యేక ఇంటర్వ్యూ చేపట్టింది. విద్యార్థులకు ఏవిధంగా క్రీడల్లో శిక్షణలు అందిస్తున్నారో శుభాషిణి వివరించారు. నాగర్ కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో శుభాషిణి వ్యాయమ టీచర్ గావిధులు నిర్వహిస్తున్నారు.

ఇది చదవండి: ఏజెన్సీలో లంపిస్కిన్ వ్యాధి కలవరం.. పశువైద్యుల సూచనలు ఇవే..!

హై స్కూల్ విద్యార్థులకు ఆమె అన్నిరకాల క్రీడల్లో శిక్షణ అందిస్తూ.... వ్యాయామ పద్ధతులను కూడా నేర్పిస్తున్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన శుభాషిణి 2007లో వ్యాయమ ఉపాధ్యాయులుగా విధుల్లో చేరారు. చిన్నతనం నుండి క్రీడలల్లో ప్రతిభను కనబర్చుతూ జాతీయ స్థాయిలో పలు పథకాలు సాధించారు. వ్యాయమ ఉపాధ్యాయురాలుగా ఉంటూ కూడా జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించారు. తన లాగే విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించాలని శిక్షణలు అందిస్తున్నారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు