Naveen Kumar, News18, Nagarkurnool.
దివ్యాంగులు మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేయబడుతుంది. డిసెంబర్ 3 దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి అవార్డులను బహుమతులను ప్రధానం చేసేందుకు ప్రభుత్వం క్రీడా పోటీలను నిర్వహించింది. విభిన్న ప్రతిభావంతుల క్రీడా మహోత్సవం పేరుతో కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలను జిల్లా మహిళా శిశు, వికలాంగ సంక్షేమ అధికారులు చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 400 మంది దివ్యాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఈ పోటీలను చేపట్టి దివ్యాంగుల్లో మానసిక స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.
క్యారమ్స్, చెస్,షార్ట్ పుట్, 800, 400 మీటర్స్ రన్నింగ్వంటి గేమ్స్‌ను దివ్యాంగులతో ఆడించారు. ఈ గేమ్స్‌ను చూసేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని చాలామంది క్రీడ అభిమానులు మైదాన ప్రాంతానికి చేరుకున్నారు. దివ్యాంగులు రన్నింగ్,షాట్ పుట్,క్యారమ్స్, చెస్ ఆడుతుంటే వారి ఆనందం చూసి ఎంతో ముచ్చట పడ్డారు. వారు పొందుతున్నటువంటి ఆనందం చూసి వీరు కూడా ఆనందించారు.
ఇంట్లో కూర్చుని ఉండే తమను బయట ప్రపంచానికి తీసుకొని వచ్చి ఇలాంటి క్రీడలను ఆడించడం ద్వారా మానసిక ఉల్లాస ఉందని చాలామంది దివ్యాంగులు చెప్పుకొచ్చారు. దివ్యాంగులను గుర్తించి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని దివ్యాంగులసంఘం నాయకులు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 400 మంది దివ్యాంగులు ఈ క్రీడలు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు జిల్లా స్థాయిలో మొదటి, రెండవ బహుమతులను అన్ని క్రీడల్లో అందిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు.
Mulugu: 75 సంవత్సరాల పార్లమెంటరీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు..
అనంతరం రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో కూడా పాల్గొనేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు. దివ్యాంగులకు కావలసిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసి వారికి భోజనం వంటివి రవాణా సదుపాయాలు కల్పించి వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండాఅన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Games, Local News, Nagarkurnool, Telangana