Home /News /telangana /

NAGAR KURNOOL WHY IS CHICKEN FRY FAMOUS IN NAGARKURNOOL DISTRICT EXCERPTS SNR NNK BRV

Nagarkurnool: చికెన్ ఫ్రై‌కి అడ్డా 'నాగర్‌కర్నూల్': తప్పకుండ టేస్ట్ చేయాల్సిందే

(అక్కడి

(అక్కడి చికెన్‌ ఫ్రై టేస్టే వేరు)

Nagarkurnool: చికెన్ ఫ్రై, జొన్నరొట్టె రుచికి నాగర్‌కర్నూల్ జిల్లా వాసులు అలవాటు పడిపోయారు. దీంతో ఒక్కో షాపులో రోజుకు 30 కిలోల చొప్పున మొత్తం 50 షాపుల్లో దాదాపుగా 1500 కిలోల వరకు చికెన్ ఫ్రై అమ్మకాలు జరుగుతాయి.

    (N.Naveen Kumar,News18,Nagarkurnool)
    మన దేశంలో ప్రతి ప్రాంతానికి ఒక ఫుడ్ కల్చర్ ఏర్పడింది. ఒక్కో ఏరియాలో ఒక్కో రకమైన వంటకం పేరుగాంచింది. ఉదాహరణకు హైదరాబాద్ బిర్యానీ, గుంటూరు మిర్చి బజ్జి, కర్నూల్ ఉగ్గాని బజ్జీ, కాకినాడ ఖాజా, ఆత్రేయపురం పూతరేకులు, అరకు బొంగులో చికెన్ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ప్రసిద్ధిగా నిలుస్తున్నాయి. అటువంటి ఒక రుచికరమైన వంటకం మన నాగర్‌కర్నూల్ (Nagarkurnool) పట్టణంలోనూ పాపులర్(Popular)అయింది. అదే చికెన్ ఫ్రై, జొన్నరొట్టే. గత కొన్నేళ్లుగా నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఈ చికెన్ ఫ్రై(Chicken fry), రొట్టె (Bread)వంటకం ఇక్కడి ప్రజలకు ఎంతగానో నచ్చింది.

    ఇది చదవండి: సాగుకు సిద్ధమైన రైతన్నలు .. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏరువాక పౌర్ణమి సందడి



    30 ఏళ్ల క్రితం జిల్లాకు పరిచయమైన \"చికెన్ ఫ్రై\":
    చికెన్ ఫ్రై అన్నీ ప్రాంతాల్లోనూ ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాల్లో హోటల్స్, రెస్టారెంట్‌లకు వెళ్ళినపుడు ప్రత్యేకంగా ఆర్డర్ ఇస్తేనే వాటిని తయారు చేసి అందిస్తారు హోటల్స్ వారు. కానీ నాగర్‌కర్నూల్‌లో మాత్రం చికెన్ ఫ్రై ఇన్స్టంట్ గా దొరుకుతుంది. వచ్చే కస్టమర్లు ఎక్కువగా చికెన్ ఫ్రైనే ఆర్డర్ చేస్తుండడంతో ఇక్కడ ఫాస్ట్‌ఫుడ్ కంటే వేగంగా చికెన్ ఫ్రై అందుబాటులో ఉంటుంది. మొట్టమొదటగా 30 ఏళ్ల కిందట నాగర్‌కర్నూల్ పట్టణంలో ఈ చికెన్ ఫ్రై, జొన్నరొట్టె వంటకం పరిచయం అయింది. \"రెడ్డి చికెన్ ఫ్రై సెంటర్\" ద్వారా నగర వాసులకు ఈ వంటకం పరిచయమైంది. చికెన్ ఫ్రై టేస్ట్ బాగుండటంతో క్రమంగా ఆ కల్చర్ విస్తరిస్తూ వచ్చింది. ఒక షాపుతో మొదలై ప్రస్తుతం నాగర్‌కర్నూల్ పట్టణంలో దాదాపు 50 వరకు చికెన్ ఫ్రై సెంటర్లు వెలిసాయి. పట్టణంలో ఉయ్యాలవాడ వార్డ్ సరిహద్దు నుంచి నల్లవెల్లి రోడ్, శ్రీపురం రోడ్, కొల్లాపూర్ చౌరస్తా, ఎండబెట్ల వరకు నగరం నలుమూలలో విస్తారంగా చికెన్ ఫ్రై సెంటర్లు వెలిశాయి.

    ఇది చదవండి: వయసేమో మూడు.. రికార్డులేమో బోలెడు.. అద్భుతాలు సృష్టిస్తున్న కరీంనగర్ బుడ్డోడు..



    ఒక్కో షాపులో రోజుకు 30 కిలోల వరకు అమ్మకాలు:
    చికెన్ ఫ్రై, జొన్నరొట్టె రుచికి నాగర్‌కర్నూల్ జిల్లా వాసులు అలవాటు పడిపోయారు. దీంతో ఒక్కో షాపులో రోజుకు 30 కిలోల చొప్పున మొత్తం 50 షాపుల్లో దాదాపుగా 1500 కిలోల వరకు చికెన్ ఫ్రై అమ్మకాలు జరుగుతాయి. ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో కస్టమర్స్ చికెన్ ఫ్రై జొన్న రొట్టెల కోసం వస్తుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకూర్తి నియోజకవర్గాల నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు ఎక్కువగాచికెన్ ఫ్రై వంటకాన్ని తినే వెళ్తారని దుకాణదారులు అంటున్నారు.

    ఇది చదవండి: అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు .. వేములవాడలో నిర్వాహణకు నోచుకోని నిఘా వ్యవస్థ 



    కిలో చికెన్ ఫ్రై రూ.150 మాత్రమే:
    సాధారణంగా పెద్ద హోటల్స్‌లో దొరికే చికెన్ ఫ్రై..ప్లేట్ ధర రూ. 150 - రూ. 400 ఉంటుంది. అయితే నగర్‌కర్నూల్‌లో మాత్రం చికెన్ ఫ్రై వంటకాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లోనే అందిస్తున్నారు దుకాణదారులు. కిలో చికెన్‌ను ఫ్రై చేసి రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు హోటల్ నిర్వాహకుడు వినోద్ వివరించారు. ఉదాహరణకు చికెన్ ధర రూ.300 ఉంటే ఫ్రై చేసేందుకు రూ.150, మొత్తం రూ.450 వసూలు చేస్తారు. వీటితో పాటు జొన్నరొట్టె ఒక్కొకటి రూ.10కు విక్రయిస్తున్నారు. చికెన్‌తో పాటు జొన్నరొట్టెలు కూడా అదే స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. రోజుకు ఒక సెంటర్‌లో 100 నుంచి 150 వరకు జొన్నరొట్టెలను విక్రయిస్తున్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ దగ్గర మెయిన్ రోడ్‌పై వినోద్ చికెన్ సెంటర్‌లో ఫుడ్ చాలా టేస్టీ ఉంటుందని కస్టమర్లు చెబుతున్నారు. వినోద్ చికెన్ సెంటర్ ఫోన్ నెంబర్: 6300873560
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Nagar kurnool

    తదుపరి వార్తలు