హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: బాల్యవివాహం అడ్డుకునే ప్రయత్నం... తాళి కట్టాక బాలికను తీసుకెళ్లిన సఖీ బృందం

Nagarkurnool: బాల్యవివాహం అడ్డుకునే ప్రయత్నం... తాళి కట్టాక బాలికను తీసుకెళ్లిన సఖీ బృందం

సఖి సెంటర్ నిర్వాహకులు

సఖి సెంటర్ నిర్వాహకులు

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బస్వాపురం గ్రామంలో బాల్యవివాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు సఖి కేంద్ర నిర్వాహకులు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  N.Naveenkumar, News 18, Nagarkurnool

  Nagarkurnool; జోగులాంబ గద్వాల(Gadwal) జిల్లా ఉండవెల్లి(Undaveli) మండలం బస్వాపురం(Baswapuram) గ్రామంలో బాల్యవివాహాన్ని(child marriage) అడ్డుకునే ప్రయత్నం చేశారు సఖి కేంద్ర నిర్వాహకులు. బస్వాపురం గ్రామానికి చెందిన చిన్న బడేసాబ్, అంజనమ్మ దంపతుల కుమారుడు హరికృష్ణకు కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండకి చెందిన ఓ బాలికతో (15) వివాహం నిశ్చయించారు. బాలికకు ఆదివారం అబ్బాయి ఇంటి వద్ద వివాహం చేస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు 1098కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో పెళ్లి వేడుక వద్దకు చేరుకున్న అధికారులు పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పెళ్లి జరిగిపోయింది. దీంతో అధికారులు ఆ బాలికను సఖీ బృందానికి అప్పగించారు. ఈసందర్భంగా ఐసిడిఎస్ అధికారి పద్మ మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టారీత్యా నేరమని ఇలాంటి వివాహాలు జరిపిస్తే చట్టపరమైన శిక్షలు తీసుకుంటామని హెచ్చరించారు.

  జ్వరంతో విద్యార్థిని మృతి..ఒంటరిగా మిగిలిన అక్క:

  దేవరకద్ర మండలంకు చెందిన ఓ విద్యార్థిని జ్వరంతో(Fever) మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 9వ తరగతి చదువుతున్న మహేశ్వరి (14) జ్వరంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. దేవరకద్ర దళితవాడకు చెందిన ఎద్దుల రవి - హుస్సేనమ్మ దంపతులకు రాధ, మహేశ్వరి కూతుళ్లు ఉన్నారు. ఐదేళ్ల క్రితం ప్రమాదవశాత్తు ఎద్దుల రవి మృతి చెందాడు. మరో ప్రమాదంలో హుస్సేనమ్మ మృతి చెందింది. దీంతో రాధా, మహేశ్వరి అనాధలయ్యారు. దీంతో రాధా చదువు మానుకుని ఓ షాపులో పనికి కుదిరింది. చెల్లి మహేశ్వరి దేవరకద్ర జెడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన మహేశ్వరీ శనివారం రాత్రి మృతి చెందింది. ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయిన రాధా.. తన చెల్లిని కూడా కోల్పోవడంతో కన్నీరుమున్నీరైంది. సమాచారం ఆదుకున్న అంబేడ్కర్ సంఘం నాయకులు, దయనీయస్థితిలో ఉన్న రాధకు అండగా నిలిచారు. రూ.40,150 చందాలు వసూలు చేసి బాధితురాలకు అందజేశారు.

  Read this also;  Peddapalli: దేవుడు లేని గుడి: అయినా అక్కడికి ప్రజలు ఎందుకు బారులు తీరుతున్నారు?

  విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి:

  విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట పరిధిలో చోటుచేసుకుంది. ఐజ మండలం బింగిదొడ్డి తాండాకు చెందిన గొల్ల అరవింద్ (20) మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలానికి వెళ్ళాడు. రోజులానే విద్యుత్ మోటార్ ఆన్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మోటార్ నుంచి నీరు ఆగిపోగా అరవింద్ పరిశీలించేందుకు ప్రయత్నించాడు. ఈక్రమ్మలో ముందుగా కరెంటు ఆఫ్ చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడి తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Child marriages, Crime news, Local News, Nagarkurnool, Telangana

  ఉత్తమ కథలు