హోమ్ /వార్తలు /తెలంగాణ /

అడవిలో జంతువులకు నీటి 'సాసర్ ఫీట్'లు..

అడవిలో జంతువులకు నీటి 'సాసర్ ఫీట్'లు..

అడవిలో నీళ్ల ఏర్పాటు

అడవిలో నీళ్ల ఏర్పాటు

Telanana: వేసవి వచ్చిందంటే మనుషులకే కాదు వన్యప్రాణులకు తాగునీటికి కష్టం వస్తుంది. ఎండ తీవ్రతకు కుంటలు చెలిమేలు, వాగులు ఎండిపోయి వన్య ప్రాణులు మైదాన ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

వేసవి వచ్చిందంటే మనుషులకే కాదు వన్యప్రాణులకు తాగునీటికి కష్టం వస్తుంది. ఎండ తీవ్రతకు కుంటలు చెలిమేలు, వాగులు ఎండిపోయి వన్య ప్రాణులు మైదాన ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు వన్య ప్రాణులకు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగానే దట్టమైన అటవీ ప్రాంతంలో సాసర్ ఫీట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అరణ్యంలో జీవాలకు నీటి కోసం తీర్చేందుకు అటవీశాఖ చర్యలు ప్రారంభించింది. వన్య ప్రాణులకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో 701 వరకు సాసర్ ఫీట్లకు ఉన్నాయి.

ట్యాంకర్ల సహాయంతో వాటిని నీటితో నింపుతున్నారు. అలాగే సమీప ప్రాంతాల్లో సహజ సిద్ధమైన నీటి వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన ప్రాంతాల్లో 25 సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశారు. అమ్రాబాద్ ఏరియాలో 420 సాసర్ ఫీట్లు అచ్చంపేట ఏరియాలో 281 నిర్మించారు.

కొత్తగా మరో మూడు సోలార్ పంప్ సీట్లను ఏర్పాటుకు బోర్డ్ డ్రిల్లింగ్ చేసేందుకు జియాలజిస్ట్ ను సంప్రదించారు. మద్దిమడుగు, అమ్రాబాద్, మన్ననూరు, చారకొండ రేంజ్ ఫారెస్ట్ పరిధిలో సోలార్ సాయంతో పని చేసే బోర్లతో నీటి వసతి కల్పించారు. సహజసిద్ధమైన నీటి వనరులు ఉండే ప్రాంతాల్లో బోర్లు వేసి సోలార్ సాయంతో వాటి నీటితో నింపుతున్నారు.

వన్య ప్రాణులకు అవసరమైన పచ్చిక బయలు సైతం పెంచుతున్నారు. నిండు వేసవిలో సైతం గ్రామాల్లోకి పుణ్య ప్రాణుల తాగనీటి కోసం రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్ ఫారెస్ట్ లో పులుల సంఖ్య, మాంసాహార జంతువుల సంఖ్య బాగా పెరిగింది.

పెరిగిన సంఖ్యకు అనుగుణంగా ఆహారం నీటి కొడత లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సాసర్ ఫీట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జింకలు, దుప్పులు, అడవి పందులు, కుందేలు ఇతర శాకాహార జంతువుల రాకను గుర్తిస్తున్నారు. ఇందుకోసం ఫారెస్ట్ శాఖ అధికారులు గ్రౌండ్ స్థాయిలో ఉండే వాచర్లు ప్రత్యేక దృష్టిని కేటాయించారు. వేసవిలో ఏ జంతువులు కూడా దాహార్తి కోసం అలమట్టించకుండా ఉండేందుకు ఈ తరహా ఏర్పాట్లను పక్కాగా ఏర్పాటు చేస్తున్నారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana