హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : మహిళ ప్రవేశించిందని గుడికి తాళం వేసిన గ్రామస్తులు .. కారణం అదేనట

Telangana : మహిళ ప్రవేశించిందని గుడికి తాళం వేసిన గ్రామస్తులు .. కారణం అదేనట

Dalit woman

Dalit woman

Telangana: నాగర్‌కర్నూలు జిల్లాలో దళిత మహిళ ఆలయంలోకి ప్రవేశించింది. ఈసంఘటనపై గ్రామస్తులు రాద్ధాంతం చేశారు. గుడికి తాళం వేశారు. దళిత నాయకుల ధర్నాతో దిగొచ్చిన సర్పంచ్ ఏం చేశారంటే.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

కాలం కంప్యూటర్‌ యుగాన్ని దాటేస్తూ ఫైజీ జనరేషన్‌లోకి వస్తే .. మనుషుల మధ్య కుల, మతాల సామాజిక అంతరం మాత్రం అంతకంతకు పెరుగుతోంది. తెలంగాణ(Telangana)లో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. ఆలయంలోకి దళిత మహిళ(Dalit woman)వచ్చిందనే కారణంతో గుడికి తాళాలు వేశారు గ్రామస్తులు. నాగర్‌కర్నుల్ (Nagarkurnool)జిల్లాలో జరిగిన ఈవ్యవహారం గ్రామస్థాయిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంకా ఈ నవీనయుగంలో అలాంటి చాదస్తపు మనుషులు ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Bank Robbery : బ్యాంకులో 8కేజీల గోల్డ్ మాయం .. మా బంగారం మాకివ్వమంటున్న తాకట్టు పెట్టిన కస్టమర్లు

దళిత మహిళకు అవమానం...

సమాజంలో కుల, మతాల జాడ్యం వదలడం లేదు. నిత్యం ఏదో చోట వర్ణ, వర్గ హెచ్చు తగ్గులను ప్రదర్శిస్తూ సాటి మనుషులను చులకన చేస్తున్న వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో కూడ అలాంటి సంఘటనే ఒకటి బయటి ప్రపంచానికి తెలిసింది. వంగూర్‌ మండలోని చాకలి గుడిసెల గ్రామంలో రామాలయం ఉంది. సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన వింజమురి బాలమణి అనే దళిత మహిళ ఆలయంలోకి ప్రవేశించింది. దళితురాలు రామాలయంలోకి వెళ్లడం చూసిన గ్రామస్తులు దీనిపై రాద్ధాంతం చేశారు. ఆమె బయటకు వచ్చిన వెంటనే నువ్వు దళితురాలివి కాబట్టి నువ్వు వెళ్లిన గుడిలోకి మేం వెళ్లమంటూ సోమవారం గుడికి తాళం వేశారు.

అమానుష ఘటన..

మనిషి ఎంత అభివృద్ధి చెందినా..కొన్ని గ్రామాల్లో ఇంకా సంకుచిత స్వభావంతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఈసంఘటన ద్వారా మరోసారి రుజువైంది. దళిత మహిళ రామాలయంలోకి వెళ్లిన విషయం ఆ నోట ఈనోట పడటంతో జిల్లాలోని ఎమ్మర్పీఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నేతలు చాకలిగుడిసెల గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తుల చేత అవమానించబడిన దళిత మహిళతో కలిసి ధర్నా చేపట్టారు. దళిత సంఘాల నాయకుల ధర్నాతో గ్రామ సర్పంచ్ భర్త రాజు గుడి దగ్గరకు చేరుకొని వారికి క్షమాపణ చెప్పారు.

Viral news : అమ్మవారి విగ్రహం పాదల దగ్గర అజ్ఞాత భక్తుడి లేఖ .. ఏం కోరిక కోరాడో తెలిస్తే షాక్ అవుతారు

కుల వివక్ష పోయేదెప్పుడో..

అనంతరం మూసివేసిన రామాలయం తాళం చెవి అప్పగించాడు. ఇలాంటి పొరపాటు ఇకపై జరగకుండా చూస్తామని చెప్పడంతో దళిత సంఘాల నాయకులంతా అవమానించబడిన మహిళ వింజమూరి బాలామణితో కలిసి ఆలయంలోకి ప్రవేశించారు. గ్రామస్తులు కేవలం సామాజిక వర్గం పేరుతో దళితుల్ని వేరుగా చూడటం మానుకోవాలని ఎమ్మార్పీఎస్ కన్వీనర్ సౌట కాశీం తెలిపారు. ఈకార్యక్రమంలో ఎమ్మెస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మహేశ్, ఎమ్మార్పీఎస్ వంగూర్ మండల అధ్యక్షుడు చింతకుంట్ల నిరంజన్, కేవీపీఎస్​జిల్లా అధ్యక్షుడు పరుశరాములు, మండల కార్యదర్శి బాలస్వామి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు ఉప్పరి బాలరాజు, జిల్లా నాయకులు బాలరాజు పాల్గొన్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Nagarkurnool, Telangana News

ఉత్తమ కథలు