హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రజలపై మున్సిపాలిటీ అధికారులు ఊహించని భారం..

ప్రజలపై మున్సిపాలిటీ అధికారులు ఊహించని భారం..

ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పన్ను

ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పన్ను

Telangana: సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై మున్సిపాలిటీ అధికారులు ఊహించని భారాన్ని మోపుతున్నారు. మున్సిపాలిటీలో నివసిస్తున్న ప్రజల స్థితిగతులు సామాన్య, పేద, మధ్యతరగతి అనే తారతమ్యంలేకుండా పన్ను వసూలు చేస్తుండడంతో గుదిబండగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై మున్సిపాలిటీ అధికారులు ఊహించని భారాన్ని మోపుతున్నారు. మున్సిపాలిటీలో నివసిస్తున్న ప్రజల స్థితిగతులు సామాన్య, పేద, మధ్యతరగతి అనే తారతమ్యంలేకుండా పన్ను వసూలు చేస్తుండడంతో గుదిబండగా మారింది. మున్సిపాలిటీలో మార్కెట్ విలువప్రకారం పన్నులు విధించడం సామాన్య తరగతి వర్గాల ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కొత్త జిల్లా ఏర్పాటు తమకు శాపమ వరమా తెలియక పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు అయోమయంలో పడ్డారు.పెంచిన మార్కెట్ విలువ ప్రకారం ఇంటి పన్నులు విధించడంతో వాటిని కట్టలేక సతమతమవుతున్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూల్ , అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, మున్సిపాలిటీలు ఉన్నాయి. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 5,678 నివాసాల గృహాలు ఉండగా 298 వ్యాపార సముదాయాలు ఉన్నాయి. గడిచిన ఏడాది ఇంటి పనులు డిమాండ్ 74, 96,000 ఉండేది.

అయితే ఈసారి ఈ డిమాండ్ ఒకేసారిగా కోటి 70 లక్షలకు చేరింది. మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడితో ఇప్పటివరకు రూ.66,02,000 రూపాయలు వసూలు కాగా మిగతా బ్యాలెన్స్ రూ.57,68,000 కోసం ఉన్నతాధికారుల నుంచి తీవ్ర వత్తిళ్లు ఎదుర్కోవడంపై సిబ్బందిలో ఆవేదన వ్యక్తం అవుతుంది. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిస్థితి కూడా ఎందుకు భిన్నంగా లేదు. ఇక్కడ కోటి రూపాయల వసూళ్లకోసం ఒత్తిడి పెరుగుతుండడంతో మున్సిపల్ సిబ్బంది కాళ్లు అరిగేలా ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 8,289 నివాస గృహాలు ఉండగా 219 వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఆస్తిపన్ను డిమాండ్ 3,56, 99,000 ఉంది. ఇప్పటివరకు రూ.2,8,64,000 వసూలు కాగా బ్యాలెన్స్ ఉన్న కోటి రూ.48,35,000 కోసం మున్సిపల్ సిబ్బంది గృహ యాజమాన్యాలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.

ఇక్కడ కూడా గృహాలు 6,149 ఉండగా పన్నులు గణనీయంగా పెరిగాయి.2022- 23 సంవత్సరానికి గాను ఆస్తిపన్ను డిమాండ్ మూడు కోట్ల 41 లక్షలు కాగా ఇప్పటివరకు రూ.కోటి 87 లక్షల వసూలు అయ్యాయి. మిగతా సొమ్ము కలెక్షన్ కోసం మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పనులు ఇష్టానుసారంగా పెంచింది.దీంతో బతకడమే కష్టంగా ఉన్న సామాన్య మధ్యతరగతి మీద ప్రజలకు ఇంటి పన్ను భారం అయిపోయింది.

ఒకవైపు నిత్యాసరసలు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దానికి తోడు ఇటీవల పన్ను పేరుతో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలో పెంచిన పనులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. వీటికి తోడు మున్సిపాలిటీ చేసే క్రమంలో పట్టణాలకు సమీపంలో ఉన్న పలు గ్రామాలను కూడా మున్సిపాలిటీలో మిళితం చేశారు. వీరికి కూడా ఈ పన్ను భారం తప్పేలా లేదు. ఇక్కడ విలీనం చేసిన గ్రామాల్లో చాలా వరకు పేద కుటుంబ వారే ఉంటారు. వీరికి మున్సిపాలిటీ వేలల్లో పన్నులు విధిస్తుండడంతో ప్రజలంతా లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితి మార్చాలన్న డిమాండ్ చాలా వరకు ఎదురవుతుంది.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు