Home /News /telangana /

NAGAR KURNOOL TWO SCHOOL GIRLS MISSING AND ONE STUDENT COMMITTED SUICIDE IN NAGARKURNOOL CRIME BULLETIN ABH BRV NNK

Nagarkurnool: ఇద్దరు బాలికలు మిస్సింగ్, యువతి ఆత్మహత్య: నాగర్‌కర్నూల్ క్రైమ్ రౌండప్

నాగర్‌కర్నూల్ క్రైమ్ రౌండప్

నాగర్‌కర్నూల్ క్రైమ్ రౌండప్

ఇద్దరు బాలికలు మిస్సింగ్; ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య; పట్టపగలే చోరీ; పిల్లలతో సహా తల్లి అదృశ్యం;

  (N.Naveen kumar, News 18, Nagarkurnool)

  ఇద్దరు బాలికలు మిస్సింగ్;
  నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు కనిపించకుండా పోయారు. తాడూరు గ్రామానికి చెందిన శిరీష (16) స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, శ్రీవాణి (14) 8వ తరగతి చదువుతుంది. ఈ విద్యార్థులు మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించడం లేదు. బుధవారం అన్ని ప్రాంతాల్లో వెతికినా బాలికల ఆచూకీ లభించకపోవడంతో శిరీష తల్లి రామేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న తాడూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికల ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయవలసిందిగా తాడూరు పోలీసులు కోరారు.

  ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య;
  ప్రేమ విఫలమైందని మనస్థాపనతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బూత్‌పూర్ మండలంలో చోటుచేసుకుంది. బూత్‌పూర్ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మద్దిగుట్ల గ్రామానికి చెందిన కిల్లి వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె మమత (19) జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. అదే గ్రామానికి చెందిన హరికృష్ణను ప్రేమించింది. అప్పటికే అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఇటీవలే గ్రామస్తులు సమక్షంలో కుల పెద్దలు పంచాయతీ నిర్వహించి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో మనస్థాపానికి గురైన యువతి బుధవారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు హరికృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

  పట్టపగలే చోరీ: గద్వాల పట్టణంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. బుధవారం ఉదయం పట్టణంలోని ఓ నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. బాధితుడు గన్నోజు రవిబాబు, సి ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం గద్వాల పట్టణంలోని రాజా వీధిలో ఉన్న గాయత్రి జ్యువెలర్స్ దుకాణాన్ని తెరిచేందుకు ఓనర్ రవిబాబు ఉదయం 10 గంటల సమయంలో బైక్ పై వచ్చారు. వెంట తెచ్చిన బ్యాగును లోపల ఉంచి దుకాణాన్ని శుభ్రం చేసి అనంతరం షాప్ ముందున్న తన బైకును పక్కన పార్క్ చేసేందుకు వెళ్లారు. ఇదంతా గమనిస్తున్న ముగ్గురు వ్యక్తులు నేరుగా దుకాణంలోకి వచ్చి బ్యాగ్‌తో ఉడాయించారు. బైక్ పార్క్ చేసి దుకాణంలోకి వచ్చిన రవి బాబుకు బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఇంటి వద్దనే మర్చిపోయాయని భావించి ఇంటికి తిరిగి వెళ్లారు. బ్యాగుతోనే వెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తుచేయడంతో మళ్లీ దుకాణానికి చేరుకున్నాడు. బ్యాగు చోరీకి గురైందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్సై ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎదురుగా ఉన్న మరో దుకాణంలోని సీసీకెమెరాలను పరిశీలించగా దుండగులు బ్యాగు ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఈ బ్యాగులో 14 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. లక్ష నగదు ఉన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు.

  పిల్లలతో సహా తల్లి అదృశ్యం: ఇద్దరు పిల్లలను తీసుకొని తన భార్య కనిపించకుండా పోయిందని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహాబూబ్‌నగర్ పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహాబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాతతోటకు చెందిన నరేష్ నాయక్. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జులై 18న సాయంత్రం నాలుగు గంటలకు ట్రాక్టర్ పని మీద బయటకు వెళ్లిన నరేష్ తిరిగి ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలో భార్య శోభ, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని ఇరుగుపొరుగు వారిని ఆరా తీయగా ర్యాలీ ఆటోలో పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లిందని చెప్పారు. దీంతో ఆమె కోసం వెతికిన నరేష్ ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరన్నపేటకు చెందిన సిద్దు పై అనుమానం ఉన్నట్లు బాధితుడు చెప్పడంతో కేసు నమోదు చేసుకున్న ఎస్సై జగన్నాథం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Nagarkurnool, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు