హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: అతివేగం ప్రమాదకరం.. ఈ ఘటన చూసిన తర్వాత అదే నిజమనిస్తుంది.. సో బీ కేర్ ఫుల్

Nagar Kurnool: అతివేగం ప్రమాదకరం.. ఈ ఘటన చూసిన తర్వాత అదే నిజమనిస్తుంది.. సో బీ కేర్ ఫుల్

నాగర్ కర్నూల్ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు

నాగర్‌కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం (Sunday) జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Telangana, India

  Naveen Kumar, News18, Nagarkurnool


  నాగర్‌కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం (Sunday) జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వంగూరు మండలంలోని సర్వారెడ్డిపల్లి తండా స్టేజి వద్ద శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. వనపల్లి గ్రామానికి చెందిన గడ్డిమీది మల్లేష్ (36) బైక్ పై డిండి వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి గాయపడిన మల్లేష్ ను చికిత్స కోసం 108 వాహనంలో కల్వకుర్తి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. మృతుడు మల్లేష్‌కు భార్య భవాని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


  అచ్చంపేట మండలం పులిజాల సమీపంలో అతివేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పడంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులవివరాలు ప్రకారం పులిజాల గ్రామానికి చెందిన రాములు (35) గ్రామం నుంచి అచ్చంపేటకు తన బైక్ పై బయలుదేరాడు. అతివేగంగా బైకును నడపడంతో అదుపుతప్పి రోడ్డు సమీపంలో ఉన్న మండలాలపై పడ్డాడు.రాములు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య ఈశ్వరమ్మ, కుమారుడు ఉన్నారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


  ఇది చదవండి: ఆ వైన్స్ షాపులో నకిలీ మద్యం.. తాగినోడి పరిస్థితి ఏంటి?:


  విద్యుత్ షాక్‌తోరైతు మృతి
  విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాజీపేట మండలం ఆవంచ చెందిన వెంకటయ్య (52) బాదేపల్లి నిమ్మగడ్డ వారి ప్రాంతాల్లో నివాసం ఉంటూ చర్లపల్లి గ్రామ సమీపంలో కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు.శనివారం పొలం వద్ద మోటారు ఆపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కి గురయ్యాడు.దీంతో వెంకటయ్య అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.  దేవాలయంలో చోరీ

  జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలంలో కోదండ రామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చంద్రశేఖర్ నగర్ కింద క్యాంప్ కోదండ రామాలయంలో 4 వెండి కిరీటాలు (1300 గ్రాములు)తో పాటు హుండీ పగలగొట్టి నగలు తీసుకెళ్లారు దుండగులు.గతంలో కూడా ఒకసారి ఇదే ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Road accidents, Telangana

  ఉత్తమ కథలు