వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరి గుట్ట నుంచి తిరుపతికి వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు కొత్తకోట సమీపంలో బోల్తా పడింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 15 మందికి గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరింది. ఐతే ఒంటి గంట సమయంలో.. వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి రాగానే.. అదుపు తప్పి హైవే పక్కకు వెళ్లి బోల్తాపడింది.
బస్సు పూర్తిగా తలకిందులుగా పడడంతో.. ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేశారు. భయంతో వణికిపోయారు. ఈ ప్రమాదంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 15 మంది గాయపడ్డారు. శ్రీకాంత్ , అర్జున్ , ఉపేంద్ర, శ్రీరామ్, నర్సింహ , జయన్న, కృపానంద , రఫీక్, షబ్బీర్ అహ్మద్, షకీల, సుమలత పాటు మరో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో నర్సింహ, షకీల, షబ్బీర్ అహ్మద్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
దట్టమైన అడవి.. అందమైన సరస్సు తీరాన నైట్ క్యాంప్.. ఎక్కడో తెలుసా?
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డిన ప్రయాణికులకు 108 వాహనంలో వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులు ఇతర బస్సుల్లో పంపించారు. ప్రమాదం జరిగిన బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరు ప్రయాణికులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Tsrtc, Wanaparthi