(Syed Rafi, News18,Mahabubnagar)
తెలంగాణలో టీఎస్‌పీఎస్‌సీ(TS PSC) పేపర్ లీకేజీ వ్యవహారంపై విపక్షాల విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ అసమర్ధతే కారణమని..పాలకుల కుటుంబ సభ్యుల పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు విపక్షాల నాయకులు. తాజాగా బీఎస్పీ(BSP) రాష్ట్ర చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(RS Praveen kumar) పేపర్ లేకేజీపై కేసీఆర్(KCR) సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న టిఎస్ పి ఎస్ సి బోర్డు సభ్యులంతా నిందితులేనని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ రాజ ద్రోహమే అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి పాలన అమలు చేయాలి..
తెలంగాణ యువత ఉద్యోగాలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TS PSC) పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈవిషయంలో తాజాగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షలాది నిరుద్యోగ యువత జీవితాలకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ప్రవీణ్‌కుమార్ గ్రూప్ వన్ ప్రశ్నాపత్రాల లీకేజీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన సిబ్బంది కుటుంబీకులు బోర్డు సభ్యులుగా ఉండటం వల్లే జరిగిందని బోర్డు చైర్మన్ తో పాటు సభ్యులందరినీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస పరిజ్ఞానం లేని ఆరుగురికి 120 మార్కులు రావడం జరిగిందని వీరందరి కాల్ డేటా తో పాటు బోర్డు సభ్యులకు కాల్ డేటాను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
Understand the links between @BRSparty-@TelanganaCMO and @TSPSCofficial . Then you understand the magnitude of the scam. Telangana must wake up and shake up the these corrupt rulers. It’s now or never moment. #FifthRevolution pic.twitter.com/Q6WBCArbDo
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 22, 2023
పేపర్ లీక్ ప్రకంపనలు..
ఈ పేపర్ లీక్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సిట్ తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీలు బాధిత నిరుద్యోగులు కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ప్రభుత్వ బండారం బయటపడుతుందని ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకుంటే కొందరి రాష్ట్రంగా మారిందని తెలంగాణ అందరి రాష్ట్రంగా మార్చేందుకు అన్ని పార్టీలు ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.1400 గ్రామపంచాయతీ లలో 2600 కిలోమీటర్లు 200 రోజుల పాటు బహుజన రాజ్యాధికార యాత్రను నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ పెద్దల హస్తం....
అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తూ కోచింగులకు లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని ఇలాంటి తరుణంలో ప్రశ్నాపత్రాలలో లీకేజీ కావడం దారుణమని విమర్శించారు ఇంత జరుగుతున్న చైర్మన్ జనార్దన్ రెడ్డి చిన్న తప్పుగా చూస్తున్నారే తప్ప వాస్తవాలపై విచారణ జరిపించడం లేదని ఈయన ఆయాంలో అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలు అయ్యాయని ఆయన ఆరోపించారు. వెంటనే బోర్డును రద్దుచేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.ఈ కుంభకోణంలో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి అండదండలతోనే విచారణ నీరు గారుతోందన్నారు. సీఎం కార్యాలయంలో పనిచేసే రాజశేఖర్ రెడ్డి బంధువు లింగారెడ్డి బోర్డు సభ్యులుగా ఉండటం మెదక్ జిల్లాలో పార్టీ నాయకులుగా ఉన్న సుమిత్ర ఆనంద్ తోపాటు మరో టిఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ టీఎన్జీవో అధ్యక్షులుగా పనిచేసిన కారం రవీందర్ రెడ్డిలు బోర్డు సభ్యులుగా ఉండడం ఇందుకు ఉదాహరణగా తెలిపారు.కుంభకోణంలో సీఎం కుటుంబం పాత్ర ఉందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Rs praveen kumar, Telangana Politics, TSPSC Paper Leak