హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS Politics: హీట్ పెంచిన షర్మిల కామెంట్స్.. స్పీకర్‌కు టీఆర్ఎస్ కంప్లైంట్.. యాక్షన్ తీసుకుంటారా..?

TS Politics: హీట్ పెంచిన షర్మిల కామెంట్స్.. స్పీకర్‌కు టీఆర్ఎస్ కంప్లైంట్.. యాక్షన్ తీసుకుంటారా..?

వైఎస్

వైఎస్ షర్మిలపై స్పీకర్‌కు టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) కు పాలమూరు టిఆర్ఎస్ (TRS Leaders) నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) కు పాలమూరు టిఆర్ఎస్ (TRS Leaders) నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (Mahbubnagar Nagar) లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలపై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధానంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి... వైయస్ షర్మిలకు మధ్య వివాదం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వైయస్ షర్మిల చేసిన తీవ్రస్థాయి ఆరోపణలతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. చట్టసభల సభ్యులమైన తమపై వైయస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ హక్కులు గౌరవానికి భంగం కలిగించారని ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.

  ఎవరికి ఫిర్యాదు చేసినా తాను భయపడేది లేదంటూ షర్మిల ఘాటుగా స్పందించడంతో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆసక్తి మొదలైంది. ఈ యాత్రలో ఆమె ఎక్కడి నుంచి మాట్లాడినా సీఎం కేసీఆర్ సహా మంత్రులు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలపై షర్మిల కామెంట్స్ పెరగడంతో రాజకీయ అంశాలను దాటి ఆమె లేవనెత్తుతున్న అంశాలతో రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో ప్రజల్లోనూ చర్చ మొదలైంది. ఇది టిఆర్ఎస్ నేతలకు కంటగింపుగా మారింది.

  ఇది చదవండి: ఆధార్ ఉన్నా ఆదరించే వారు లేరు.., ఈ వృద్ధురాలి పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది

  ఈ నేపథ్యంలో చట్టసభల సభ్యులు మైన తమకు హక్కులకు గౌరవానికి భంగం కలుగుతుందని ఇందుకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, యాదయ్య, దాస్యం వినయ్ భాస్కర్లు తదితరులు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు.

  ఇది చదవండి: కలాపానిని తలపించే నిజాం కాలం నాటి జైలు.., మన తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

  ఈ ఫిర్యాదు పై వైఎస్ షర్మిల సైతం ఘాటుగాని స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె సమాధానం ఇచ్చారు. "స్పీకర్ తనపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని ఓ తల్లిని మరదలు అంటూ కించపరచడంతో తనతో పాటు మహిళలను అవమానిస్తే మాట్లాడిన మంత్రిపైన కఠిన చర్యలు తీసుకోవాలని" విజ్ఞప్తి చేశారు. సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేలపై తాను చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలు ఆరోపణలపై షర్మిల స్పందిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ సహా ఎమ్మెల్యేలు నెరవేర్చడం లేదని ఇందుకు నెరవేర్చేలా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

  తన పాదయాత్రలో హామీలను నెరవేర్చని నేతలను ప్రశ్నిస్తున్నానని షర్మిల వివరించారు. తాను పర్యటిస్తున్నప్పుడు అక్కడికి ప్రజల నుంచి వస్తున్న సమాచారం, ఫిర్యాదుల మేరకే తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లల మాదిరిగా వెళ్లి తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు. ఎవరికి ఫిర్యాదు చేసినా తాను భయపడేది లేదని హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు వస్తే ఏం చేయాలో తనకు తెలుసని తనను భయ పెట్టాలని చూస్తే కుదరదని షర్మిల పేర్కొన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mahbubnagar, Telangana, Trs, YS Sharmila

  ఉత్తమ కథలు