హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS: టీఆర్ఎస్ నేతల మధ్య తారాస్థాయికి విబేధాలు: బహిరంగంగా కొట్టుకుంటున్న ఇరు వర్గాలు  

TRS: టీఆర్ఎస్ నేతల మధ్య తారాస్థాయికి విబేధాలు: బహిరంగంగా కొట్టుకుంటున్న ఇరు వర్గాలు  

నాగర్​కర్నూల్​ టీఆర్​ఎస్​ ప్లెక్సీలు

నాగర్​కర్నూల్​ టీఆర్​ఎస్​ ప్లెక్సీలు

మంగళవారం రోజు సాయి చందు పుట్టినరోజు ఉండడంతో శుభాకాంక్షలు తెలుపుతూ అతని అనుచరులు అలంపూర్ నియోజకవర్గంలో పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లు చూసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను చింపేసారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  (N. Naveen Kumar, News18, Nagarkurnool)

  నాగర్​కర్నూల్​లోని (NagarKurnool) అలంపూర్ నియోజకవర్గం‌లో టిఆర్ఎస్ (TRS) నేతల మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం (MLA Abraham) వర్గీయులు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్​(Sai Chandh) వర్గీయులపై ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులు నేపథ్యంలో మంగళవారం రోజు సాయి చందు పుట్టినరోజు ఉండడంతో శుభాకాంక్షలు తెలుపుతూ అతని అనుచరులు అలంపూర్ నియోజకవర్గంలో పోస్టర్లు (Posters in Alampur constituency) వేశారు. ఈ పోస్టర్లు చూసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను చింపేసారు. అయితే ఇది ప్రత్యర్థుల పనిగా అనుమానిస్తూ సాయిచంద్ మిత్రమండలి ఆగ్రహంతో ఉన్నారు. ఈ గొడవ ఎంతవరకు వెళుతుందో నే ఆందోళన టిఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతుంది.

  పిడిగుద్దులు గుద్దుకున్న టీఆర్ ఎస్ నాయకులు;

  అంతకముందు ఆలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే అబ్రహం, సాయి చంద్​ వర్గీయులు బాహాబాహీకి దిగిన ఘటనలు ఉన్నాయి. టిఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తమకు పోటీగా మరొక టిఆర్ఎస్ నాయకుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు పిడుగులు గుద్దుకున్నారు. ఈ అంశం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ సమైక్యత కార్యక్రమంలో అతిథిగా హాజరైన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్​ వర్గీయులు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కార్యకర్తలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే దాడులకు పాల్పడ్డారు. జాతీయ సమైక్యత కార్యక్రమంలో సాయి చందుకు ఆహ్వానం లేకున్నా కార్యక్రమానికి ఎందుకు వచ్చాడని ఎమ్మెల్యే అబ్రహం వర్గం వారు సాయి చంద్​ వర్గాన్ని ప్రశ్నించారు.

  ఈ క్రమంలో మాటామాటా పెరిగి స్టేజ్ పైనే ఇరువర్గాల వారు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్​ గన్‌మెన్‌కు, పీఏకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో అలంపూర్ నియోజకవర్గం అధికార టీఆర్ఎస్‌లో ఒక్కసారిగా రాజకీయ విభేదాలు బయటపడ్డాయి.

  గత కొంతకాలంగా సాయి చందు ఆలంపూర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ నుంచి టీఆర్ఎస్ తరుపున సాయిచందు పోటీలో ఉంటారని అతని అనుచరులు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే సాయి చంద్​ పర్యటన నిర్వహించడం, కార్యకర్తలను కలుసుకోవడం వంటివి చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.

  Thieves: దొంగల వింత డిమాండ్​.. ఐదుగురం దొంగతనం చేశాం.. ఇద్దరినే పట్టుకుంటే ఎలా?

  ఈ క్రమంలో తమకి ఎక్కడ పోటీగా వస్తాడని ఆందోళన ఎమ్మెల్యే అబ్రహం వర్గీయుల్లో నెలకొంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న ఎమ్మెల్యే అబ్రహం కార్యకర్తలు జాతీయ సమైక్యత కార్యక్రమంలో ఒక్కసారిగా సాయి చందు అనుచరులపై దాడులకు తెగబడినట్లు తెలిసింది. ఎలాంటి ఆహ్వానం లేకుండా జాతీయ సమైక్యత కార్యక్రమానికి ఎందుకు వచ్చారని ఫిర్యాదులు కూడా చేసినట్టుగా పార్టీలో చర్చలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సంఘటనలతో అలంపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి వచ్చే ఎన్నికల నాటి వరకు బాహబాహీగా తలపడతారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Nagarkurnool, Telangana Politics, Trs

  ఉత్తమ కథలు