హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: జాతీయ రహదారిపై కంటైనర్​ బీభత్సం.. కూలీల ట్రాక్టర్​ను ఢీకొనడంతో ఘోరం

Nagarkurnool: జాతీయ రహదారిపై కంటైనర్​ బీభత్సం.. కూలీల ట్రాక్టర్​ను ఢీకొనడంతో ఘోరం

జడ్చర్ల ప్రమాదం

జడ్చర్ల ప్రమాదం

మొక్కలు నాటేందుకు వచ్చిన ముగ్గురు ఉపాధి హామీ కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (N. Naveen Kumar, News18, Nagarkurnool)మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా జడ్చర్ల జాతీయ రహదారిపై గ్యాస్ ఫిల్లింగ్ పనుల్లో భాగంగా మొక్కలు నాటేందుకు వచ్చిన ముగ్గురు ఉపాధి హామీ కూలీలు రోడ్డు ప్రమాదంలో (Road Accident)  మృతి చెందారు. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి  (National highway) డివైడర్ పై చెట్లు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో 8 రోజులుగా పనులు చేస్తున్నారు. గ్యాస్ ఫిల్లింగ్ పనుల కోసం జాతీయ రహదారి పక్కనే ఉండే గ్రామాల నుంచి కూలీల ముందుకు రాకపోవడంతో అటవీశాఖ డిప్యూటీ అధికారి సుమలత ఆలూరికి చెందిన 27 మంది కూలీలను పనుల్లోకి తీసుకున్నారు.
  ఇందుకోసం నిత్యం ఆలూరు గ్రామపంచాయతీ నుంచి ట్రాక్టర్లో కూలీలను తీసుకువచ్చేలా సర్పంచ్ సుకన్యతో ఒప్పించారు. జీపీ ట్రాక్టరును గ్రామ పంచాయతీ పరిధి దాటి ఎలాంటి పనులకు వినియోగించకూడదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా కూలీలు, మొక్కలను తీసుకురావడానికి వినియోగించారు. 27 మంది కూలీలు ముదిరెడ్డిపల్లి నుంచి డివిటిపల్లి వరకు పనులు చేస్తున్నారు. 27 మందిని మూడు గ్రూపులుగా విభజించి పనులు వేరువేరుగా చేశారు.


  గురువారం హైదరాబాద్ కర్నూల్ రహదారి (Hyderabad Kurnool Road)పై మల్లెబోయినపల్లి సమీపంలో అడుగడుగునా కూలీలు (Workers) పనిచేస్తున్నారు. అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో కూలీలకు మొక్కలు (Plants) అందించేందుకు ట్రాక్టర్ వచ్చింది. కూలీలు లలిత యాదమ్మ ట్రాక్టర్ పైకి మొక్కలను అందిస్తున్నారు. ఈ క్రమంలోని అటువైపుగా వస్తున్న కంటైనర్ వేగంగా వచ్చి అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డు పైపడి ఉన్నాయి. దీంతో కూలీలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
  Bhadradri: ఎక్కడిక్కడే నిలిచిపోయిన మన ఊరు - మన బడి పనులు.. ఏజెన్సీ పాఠశాలలంటే చులకనా?
  వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు కూలీలు కూడా మరణించినట్టుగా డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై కూలీల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే (Government) ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బాధితులకు న్యాయం చేస్తామండడంతో కూలీలు నిరసనను విరమించడం జరిగింది.
  కరెంట్ షాక్‌తో ఎంపీటీసీ మృతి; నాగర్​కర్నూల్​​ (Nagarkurnool) జిల్లా కోడేరు మండలంలో కరెంట్ షాక్‌తో మహిళా ఎంపీటీసీ మృతి చెందింది.ఈ సంఘటన రాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జయమ్మ ఎంపీటీసీ తమ మామిడి తోటలో అడవి పందుల బెడద నివారణకు గతంలో విద్యుత్ బల్బులు ఏర్పాటు చేశారు. గురువారం ఓ మామిడి చెట్టు వద్ద తలుపు తీస్తుండగా తెగిపడి ఉన్న వైరు జయమ్మ చేతికి తగలడంతో కరెంట్ షాక్‌కు గురై ఆకడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Local News, Mahbubnagar, Nagarkurnool, Road accident

  ఉత్తమ కథలు