హోమ్ /వార్తలు /తెలంగాణ /

అడవి జంతువుకు ఉచ్చువేశారు.. చివరకు వాళ్లే చిక్కారు

అడవి జంతువుకు ఉచ్చువేశారు.. చివరకు వాళ్లే చిక్కారు

నాగర్ కర్నూల్ జిల్లాలో వన్యప్రాణి వేటగాళ్ల అరెస్ట్

నాగర్ కర్నూల్ జిల్లాలో వన్యప్రాణి వేటగాళ్ల అరెస్ట్

అడవి జంతువులను కాపాడేందుకు వణ్య ప్రాణులను సంరక్షించేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకువచ్చాయి. అడవిలో స్వేచ్ఛగా విహరించే జంతువులను వేటాడినా కానీ వాటికి ఏమైనా హాని కలిగించినా, వాటిని వేధించిన జంతు హింస చేపట్టిన కఠినమైన శిక్షలను అమలు చేస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

అడవి జంతువులను కాపాడేందుకు వణ్య ప్రాణులను సంరక్షించేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకువచ్చాయి. అడవిలో స్వేచ్ఛగా విహరించే జంతువులను వేటాడినా కానీ వాటికి ఏమైనా హాని కలిగించినా, వాటిని వేధించిన జంతు హింస చేపట్టిన కఠినమైన శిక్షలను అమలు చేస్తుంది. అడవి జంతువుల్లో కొన్ని రకాల జంతువులను నమోదు చేస్తూ అడవిలో పెరిగేటువంటి అరుదైన జంతువులను వీటిని వేటాడిన కానీ చట్టపరమైన చర్యలు చేపట్టి కటకటాల్లోకి పంపిస్తున్నారు. అయితే ప్రభుత్వం అటవీశాఖ అధికారులు ఎన్ని దాడులు చేపట్టిన ఎంత పగడ్బందీగా కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక మూల అటవీ జంతువులు హత్యకు గురవుతూనే ఉన్నాయి. వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. వేటగాళ్లు పన్నిన వలలో చిక్కుకొని గాయాల పాలవుతున్నాయి.

ఇలాంటి ఘటనలను అటవీశాఖ అధికారులు చాలావరకు అరికడుతున్న కానీ ఎక్కడ ఒక మూల మళ్ళీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వన్యప్రాణుల మాంసాన్ని విక్రయిస్తూ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కాబడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) అమ్రాబాద్ మండలంలో చోటుచేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడి మాంసం విక్రయిస్తున్న వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా పత్రుకున్నారు. వన్య ప్రాణులను వేటాడిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్టు అమ్రాబాద్ అటవీ రేంజ్ అధికారి ప్రభాకర్ ప్రకటించారు. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 23వ తేదీన మాచారం సమీపంలోని అడవిలో ఉచ్చు వేసి వన్యప్రాణి కణితిని వేటాడారు.

ఇది చదవండి: ప్రశాంతంగా ఉన్న ఆలయంలో ఒక్కసారిగా మంటలు.. అసలేం జరిగింది..?

ఈ ప్రాణి మాంసాన్ని విక్రయించడానికి అమ్రాబాద్ కు వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఒక్క సరిగా దాడులు చేశారు. మండల పరిధిలోని జంగారెడ్డి పల్లికి గ్రామానికి చెందిన దాసరి వెంకటయ్య, దాసరి శివ, దాసరి బాలుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

వీరి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, వేటకు ఉపయోగించిన కత్తులు, బ్యాటరీ, కణతి మాంసము, ఉచ్చులు, సెల్ ఫోన్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వీరిలో దాసరి వెంకటయ్యను అరెస్ట్ చేసి అచ్చంపేట కోర్టులో హాజరు పట్టినట్లుగా చెప్పారు. అటవీ సెక్షన్ అధికారి మధుసూదన్ బీట్ ఆఫీసర్ హనుమంతు ఫిబ్రవరి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వీరిని పట్టుకోవడం జరిగింది.

First published:

Tags: Local News, Nagarkarnol district, Telangana

ఉత్తమ కథలు