Naveen Kumar, News18, Nagarkurnool
ఈ రోజుల్లో లాభసాటి బిజినెస్ ఏదంటే టక్కున గుర్తొచ్చేది ఫుడ్ బిజినెస్. మంచి ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు ఏడాదిలోపే పెట్టుబడంతా వచ్చేస్తుంది. కాస్త బాగా సక్సెస్ అయితే అది ఫ్రాంఛైజీ వ్యాపారంగా మారుతోంది. తెలంగాణ (Telangana) లోని నాగర్ కర్నూల్ (Nagar Kurnool District) ప్రజలు కొత్తకొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. ఎక్కడ టేస్టీ ఫుడ్ లభిస్తే అక్కడ వాలిపోతున్నారు. దీనిని గుర్తించిన శివ అనే యువకుడు సరికొత్త రుచులతో స్నాక్స్ సెంటర్ ప్రారంభించాడు. తక్కువ ధరకు మంచి టేస్టీ స్నాక్స్ లభిస్తుండడంతో ఫుడ్ లవర్స్ ఇక్కడికి క్యూ కడుతున్నారు. దీంతో తక్కువ సమయంలోనే పట్టణ ప్రజల ఆదరణ దక్కించుకుని వ్యాపారంలో నిలదొక్కుకుంటున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన శివ అనే యువకుడు సొంతంగా వ్యాపారం చేయాలనీ భావించి ఏదైనా ఫుడ్ ఫ్రాంచైజ్ తీసుకుంటే బాగుటుందని 'బ్రీత్ ఫైర్' అనే సంస్థ నుంచి ప్రాంఛైజీ తీసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని మునీంద్ర కాంప్లెక్స్ వెనక వైపు బ్రీత్ ఫైర్ స్నాక్స్ సెంటర్‌ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తున్నాయి.
నాన్‌వెజ్‌కు సంబంధించి చికెన్ వింగ్స్, చికెన్ లాలీపాప్స్, చికెన్ లెగ్ పీసెస్, చికెన్ ఫ్రైడ్ పీసెస్, చికెన్ మంచూరియా, చికెన్ రోస్ట్ వంటి ఐటెంతో పాటు వెజిటేరియన్ ఫుడ్ అయిన ఫింగర్ చిప్స్, ఆలూ చీప్స్‌ను సరికొత్తగా అందిస్తున్నారు. ఇక్కడి ఫుడ్ మెనూలో ఐటమ్స్ ఎంతో రుచిగా ఉండడంతో పట్టణంలోని యువత సాయంత్రం అయితే చాలు ఈ స్నాక్స్ సెంటర్ దగ్గర వాలిపోతున్నారు.
ఈ స్నాక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.4 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పుకొచ్చారు. రోజూ తినే ఫుడ్‌లోనే కొత్తదనం అందిస్తే ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని నమ్మకంతోనే తాను ఈ స్నాక్స్ సెంటర్ ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ అందిస్తుండడం, నాణ్యమైన మరియు టేస్టీ, స్పైసీ ఫుడ్ అందిస్తుండటంతో కస్టమర్ల ఆదరణ లభిస్తుందని వివరించాడు.
ఈ బ్రీత్ ఫైర్ స్నాక్స్ సెంటర్ లో రూ. 20 నుంచి రూ. 60 వరకు చాలా తక్కువ ధరలో క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నట్లు శివ చెప్పుకొచ్చాడు. పెద్ద పెద్ద రెస్టారెంట్లో దొరికే ఫుడ్‌ను తాము తక్కువ ధరకే అందిస్తున్నామని వివరించాడు. తమకు కస్టమర్ల ఆదరణ పెరుగుతుందని వివరించారు. టేబుల్ సర్వీస్‌తో పాటు హోమ్ డెలివరీ సర్వీస్‌ని కూడా తమ అందిస్తున్నామని, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి డెలివరీ చేస్తామని చెప్పుకొచ్చాడు. శివ, స్నాక్స్ సెంటర్ యజమాని - 9160602411.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana