హోమ్ /వార్తలు /తెలంగాణ /

వందేళ్లనాటి తాళం.. రెండు నిముషాలు తిప్పితేగానీ ఓపెన్ కాదు..! ఎలా పనిచేస్తుందంటే..!

వందేళ్లనాటి తాళం.. రెండు నిముషాలు తిప్పితేగానీ ఓపెన్ కాదు..! ఎలా పనిచేస్తుందంటే..!

X
నాగర్

నాగర్ కర్నూల్ లో వందేళ్లనాటి తాళం

ఎక్కడికైనా బయటికి వెళ్లినా, ఇంట్లో ఎవరైనా లేకపోయినా ఇంటికి తాళం వేసి అన్ని గడియలు పెట్టి వెళ్తూ ఉంటాం. ఇలా ఇంటికి తాళాలు వేసి వెళ్లడం ఇప్పుడేమీ కొత్తది కాకపోయినా.. పూర్వకాలంలో ఏ విధంగా చేసేవారు ఒకసారి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

ఎక్కడికైనా బయటికి వెళ్లినా, ఇంట్లో ఎవరైనా లేకపోయినా ఇంటికి తాళం వేసి అన్ని గడియలు పెట్టి వెళ్తూ ఉంటాం. ఇలా ఇంటికి తాళాలు వేసి వెళ్లడం ఇప్పుడేమీ కొత్తది కాకపోయినా.. పూర్వకాలంలో ఏ విధంగా చేసేవారు ఒకసారి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన క్రమంలో చాలావరకు డిజిటల్ లాకర్లు వచ్చాయి. డిజిటల్ పాస్వర్డ్ ద్వారా ఇంటికి తాళం వేయవచ్చు. మళ్లీ ఆ పాస్వర్డ్ ద్వారానే లాక్ తీసే ఫెసిలిటీసులు ఉన్నాయి. అయితే గత 100 ఏళ్ల క్రితం ఇంటికి తాళాలు వేసేందుకు ఒక ప్రత్యేకమైన పరికరాన్ని వినియోగించేవారు. దీనిని తిప్పుడు తాళం అంటారు. ఈ తిప్పుడు తాళాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.

నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) తెలకపల్లి మండలం పర్వతాపురం గ్రామంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఊషన్న ఇంటిలో ఈ తిప్పుడు తాళం నేటికీ వినియోగిస్తున్నారు. ఈ తాళాన్ని వారి కుటుంబీకులు 100 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినట్టుగా వివరించారు. ఈ తిప్పుడు తాళంలో ఒక ఆసక్తికరమైన ఆకారంలో ఉంటుంది. ఈ తిప్పుడు తాళాన్ని వేయాలన్నా.. తాళం తీయాలన్నా దాదాపుగా రెండు నుంచి మూడు నిమిషాల సమయం పడుతుంది. తాళం వేయడానికి వినియోగించే తాళం చెవి చాలా పెద్దగా ఉంటుంది. వీటిని తాళంలో పెట్టి దాదాపుగా రెండు నిమిషాల పాటు తిప్పవలసి ఉంటుంది. ఇలా తిప్పడం ద్వారా తాళం బిగిసుకుపోతుంది. మళ్లీ తాళం తీయాలంటే అదే రంధ్రంలో తాళం చెవిని పెట్టి అదే పనిగా రెండు నిమిషాల పాటు తిప్పవలసి ఉంటుంది. దీని ద్వారా తాళం విడిపోయి బయటికి వస్తుంది.

ఇది చదవండి: ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. భారీ ప్రాజెక్టుతో ఉద్యోగాలు గ్యారెంటీ..!

ఈ తాళంలో మూడు రకాల పరికరాలను వినియోగిస్తారు. అందులో ఒకటి తాళం చెవి, రెండు తాళం కప్ప, బిగిసిపోవడానికి మరో పరికరంఉంటుంది. ఈ మూడు ఇనుప వస్తువుల చేత తాళం వినియోగిస్తున్నారు.అయితే ఈ తిప్పుడు తాళాన్ని 100 సంవత్సరాల క్రితం ఉషన్న అమ్మమ్మ పాపమ్మ తెలకపల్లి సంతలో కొనుగోలు చేశారని చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ వారు ఎక్కడికి వెళ్లినా కానీ ఈ తాళం వేసి బయటికి వెళ్తామని ఈ తాళం చాలా దృఢంగా మన్నికగా ఉంటుందని వివరించారు. తాళం తీయడానికి ఏ దొంగ వల్ల కూడా సాధ్యం కాదని చెప్పుకోచ్చారు. అయితే ఈ తాళానికి సంబంధించినటువంటి తాళం చెవినిఆ తాళానికి పెడితేనే ఉపయోగపడుతుందని.. అలా ఒక ప్రత్యేక ఆకారంలో ఈ తాళం చేవిని తయారు చేయడం జరుగుతుందని వివరించారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు