హోమ్ /వార్తలు /తెలంగాణ /

కాలాపానిని తలపించే నిజాం కాలం నాటి జైలు.., మన తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

కాలాపానిని తలపించే నిజాం కాలం నాటి జైలు.., మన తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

మహబూబ్‌నగర్ జిల్లాలో కాలాపానిని తలపించే జైలు

మహబూబ్‌నగర్ జిల్లాలో కాలాపానిని తలపించే జైలు

నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన వారిని శిక్షించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar District) లో నిజాం కాలపాని జైలు (Kalapani Prison) ను ఏర్పాటు చేశారు. దట్టమైన అరణ్య ప్రాంతంలో భయానక వాతావరణంలో నల్లమల అడవుల్లో 1905లో 7వ నిజాం మీర్ ఇస్మాన్ అలీ ప్రత్యేకంగా జైలును ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  దట్టమైన అరణ్యంలో జైలు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వందలాది మందిని ఇక్కడే నిర్బంధం చేసేవారు. పండిట్ నరేంద్రజీ ఏడాదిన్నర పాటు జైలు జీవితం ఈ జైలులోనే గడిపారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన వారిని శిక్షించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar District) లో నిజాం కాలపాని జైలు (Kalapani Prison) ను ఏర్పాటు చేశారు. దట్టమైన అరణ్య ప్రాంతంలో భయానక వాతావరణంలో నల్లమల అడవుల్లో 1905లో 7వ నిజాం మీర్ ఇస్మాన్ అలీ ప్రత్యేకంగా జైలును ఏర్పాటు చేశారు. ఆరు అడుగుల వెడల్పు, ఎత్తులో ఇరుకుగా జైలు నిర్మించి ఉద్యమకారులను చిత్రహింసలు పెట్టేవారు. జైలులో బందీల మధ్య ఎలాంటి సమాచారం జరగకుండా ఉండేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ జైలుకు ఎదురుగా నవాబులు వారి సేవకులు ఉండేందుకు విడిది భవనానికి 100 అడుగుల దూరంలో జైలు బావి ఉండేది.

  ఈ జైలును నిజాం కాలాపాని జైలుగా పిలుచేవారు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూరులో దీనిని నిర్మించారు. నిజాం ప్రాంత అండమాన్‌గా (కలాపాని) ప్రసిద్ధికెక్కిన ఈ జైలు... నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. బ్రిటిష్ కాలంలో అండమాన్ నికోబార్ దీవుల్లో సెల్యులర్ జైలును 'కాలాపాని జైలుగా' పిలవగా, నిజాం కాలంలో మన్ననూర్లో ఏర్పాటు చేసిన జైలును సైతం కాలాపాని జైలుగా పిలుచుకునేవారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వందలాదిమంది ఉద్యమకారులను ఇక్కడి నుంచి తీసుకొచ్చి బంధించేవారు.

  ఇది చదవండి: సంపాదన కంటే సాంప్రదాయమే ముఖ్యం.., పురాణశాస్త్రాలకు ప్రాణం పోస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్..

  నల్లమలలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నీటిని తాగి బందీగా ఉన్నవారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దర్బర పరిస్థితుల్లో ఉద్యమకారులు ఇక్కడ జైలు జీవితం గడిపేవారు. 1948లో స్వాతంత్ర పోరాట సమయంలో నవాబులు పాలకులు పోలీసులపై తిరుగుబాటు ఉద్యమం చేసిన వారిని కూడా ఈ జైల్లోనే ఉంచినట్లు తెలుస్తుంది.

  ఇది చదవండి: ప్రభుత్వ కాలేజీలో చదివితే ర్యాంకులు రావన్నది ఎవరు..? వీళ్లను చూస్తే శభాష్ అంటారు..!

  పండిత్ నరేంద్రజి స్మారకం ఏర్పాటు: ఆర్య సమాజ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పండిత్ నరేంద్ర జీని సైతం 1938లో ఈ జైల్లో బంధించారు. పండిత్ నరేంద్ర జీకి నిజాం మూడేళ్లపాటు జైలు శిక్ష విధించగా ఆయన 17 నెలల 21 రోజుల పాటు మన్ననూరు జైల్లో శిక్షను అనుభవించారు. పండిత్ నరేంద్ర జి విడుదల చేసేందుకు అప్పట్లో మహాత్మా గాంధీ ప్రయత్నంలో పండిత విద్యాలంకర్ ద్వారా నిజాం ప్రధాని సర్ అక్బర్ హైదర్ తో సంప్రదింపులు జరిపారు. అయినా నరేంద్ర జి విడుదలకు నిజాం మరో రెండు నెలల పాటు జాప్యం చేశారు.

  ఆ తర్వాత నల్లమల లోని ఫర్హాబాద్‌కు విహారం కోసం వచ్చిన అక్బర్ హైదర్ తిరుగు ప్రయాణంలో మన్ననూరు జైలును సందర్శించి అక్కడ నరేంద్ర జీతో మాట్లాడారు. ఆ మరుసటి రోజే జైలు అధికారి అశ్వానుల్లా ఖాన్ నరేంద్ర జీని విడుదల చేశారు. మున్ననూరు జైలును పండిత్ నరేంద్ర జి స్మారకంగా గుర్తించి ఆర్య ప్రతినిధి సభ హైదరాబాద్లో ఆధ్వర్యంలో 2004 సెప్టెంబర్ 17న కాలాపాని జైలు ప్రాంగణంలో స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. చారిత్రక ఘటనకు సాక్ష్యంగా నిలిచిన జైలు భవనాన్ని పరిరక్షించి జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏటా వేడుకలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mahbubnagar, Telangana

  ఉత్తమ కథలు