హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: జిల్లాలో మొట్టమొదటి సౌండ్ అండ్ లైటింగ్ సప్లయర్.., ఇప్పటికీ దసరా ఉత్సవాలంటే గుర్తొచ్చేది ఆయనే 

Nagarkurnool: జిల్లాలో మొట్టమొదటి సౌండ్ అండ్ లైటింగ్ సప్లయర్.., ఇప్పటికీ దసరా ఉత్సవాలంటే గుర్తొచ్చేది ఆయనే 

నాగర్

నాగర్ కర్నూలలో సౌండ్ సిస్టమ్స్‌కి ఫేమస్ వెంకటయ్య

పండుగలు, తిరునాళ్లు అంటే మొదట గుర్తొచ్చేది సౌండ్ సిస్టం, లైటింగ్. అవి లేకుండా ఉత్సవం ముగియదు. అలాంటి సౌండ్ సిస్టంకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది గణేష్ సౌండ్స్. నాగర్ ‌కర్నూల్ (Nagar Kurnool) పట్టణంలో సౌండ్ సిస్టం, లైట్ డెకరేషన్ అంటే ముందుగా గుర్తొచ్చేది గణేష్ సౌండ్స్.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  Naveen Kumar, News18, Nagar Kurnool

  పండుగలు, తిరునాళ్లు అంటే మొదట గుర్తొచ్చేది సౌండ్ సిస్టం, లైటింగ్. అవి లేకుండా ఉత్సవం ముగియదు. అలాంటి సౌండ్ సిస్టంకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది గణేష్ సౌండ్స్. నాగర్ ‌కర్నూల్ (Nagar Kurnool) పట్టణంలో సౌండ్ సిస్టం, లైట్ డెకరేషన్ అంటే ముందుగా గుర్తొచ్చేది గణేష్ సౌండ్స్. ఉమ్మడి మహబూబ్ ‌నగర్ జిల్లా (Mahbubnagar) లోనే గణేష్ సౌండ్ సిస్టమ్స్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పట్టణంలోనే మొట్టమొదటి సౌండ్ సిస్టం తీసుకొచ్చిన ఘనత గణేష్ సౌండ్స్ ‌ది . 1960లో నాగర్ ‌కర్నూల్ పట్టణానికి చెందిన పసుపులేటి సీతారాములు మొట్టమొదటిసారి పట్టణంలో సౌండ్ సిస్టం సెటప్ ప్రారంభించారు.

  మొదట్లో పాటల పుస్తకాలు అమ్మేటువంటి సీతారాములు వాటితో పాటు సైకిల్ రిపేర్, ఫోటో ఫ్రేమ్ వర్క్ చేసేవాడు. పట్టణంలో సౌండ్ సిస్టం లేకపోవడానికి గుర్తించిన సీతారాములు మొట్టమొదటిసారిగా రమేష్ సౌండ్ సిస్టం పేరుతో దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో రాజకీయ సభలకు, దేవాలయాలకు, పెళ్లిళ్లకు సౌండ్ సిస్టం నిర్వహించాలంటే సీతారాములనే సంప్రదించేవారు. 1988లో సీతారాములు చనిపోగా ఆయన అల్లుడు అయిన వెంకటయ్య ఈ సౌండ్ సిస్టం దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సీతారాములు మేనల్లుడైన వెంకటయ్య తన 15 ఏళ్ల వయసులో సౌండ్ సిస్టం పనులు నేర్చుకునేందుకు అమ్రాబాద్ ప్రాంతం నుంచి నాగర్‌కర్నూల్‌లో సీతారాముల దగ్గరికి వచ్చాడు.

  ఇది చదవండి: అడవిలో సివంగులు: మావోయిస్టు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ 

  ఆయన దగ్గరే ఉంటూ పని నేర్చుకొని ఆయన కూతురుని వివాహం చేసుకున్నాడు వెంకటయ్య. రమేష్ సౌండ్ సిస్టంగా ఉన్న పేరును సీతారాములు చనిపోయిన తర్వాత 1988లో గణేష్ సౌండ్ సిస్టంగా మార్చి వెంకటయ్య నిర్వహిస్తున్నారు. ఆనాటి నుండి నేటి వరకు నాగర్‌కర్నూల్ పట్టణంలో దేవాలయాలకు, పెళ్లిళ్లకు, నవరాత్రి ఉత్సవాలకు, రాజకీయ సభలకు ఇలా అన్ని కార్యక్రమాలకు సౌండ్ సిస్టం, డెకరేషన్స్ లైటింగ్స్ సప్లై చేస్తున్నారు.

  ఇది చదవండి: తల్లిదండ్రులకు కొండంత అండగా ఉండాలనుకున్నాడు, కానీ కడుపుకోత మిగిల్చాడు

  ఆ రోజుల్లో కేవలం ఒకే ఒక పుంగతో, సీరియల్ బల్బులతో ప్రారంభించి ప్రస్తుతం ఎల్ఈడి బల్బులతో, డీజే సౌండ్లతో రకరకాల డెకరేషన్స్ చేస్తూ నగర ప్రజలను ఆకర్షిస్తున్నాడు. ఆరోజుల్లో సౌండ్ సిస్టం సెటప్ సప్లై చేసేందుకు రోజుకు 30 రూపాయలు ఇచ్చేవారని ప్రస్తుతం రూ.1000 - రూ.1500 వరకు తీసుకుంటున్నామని వెంకటయ్య తెలిపారు. తనతో పాటు తన కుమారుడు గణేష్ కూడా ఇదే వృత్తిలో ఉన్నట్టు చెప్పారు. తమ పై ఉన్న నమ్మకంతో నేటికీ కస్టమర్లు వస్తూనే ఉంటారని న్యూస్ 18కి వివరించారు.

  వెంకటయ్య ఏమాత్రం చదువుకోకపోయినా నేటి టెక్నాలజీని చక్కగా అవగాహన చేసుకుంటూ సొంతంగానే సీరియల్ ఎల్ఈడి బల్బులను ఇతర డెకొరేటివ్ లైట్స్, డీజే సౌండ్స్ వినియోగిస్తున్నారు. సీరియల్ బల్బులను ఎక్కడ కూడా కొనుగోలు చేయకుండా వివిధ రకాల దేవుని ప్రతిమలను రకరకాల డిజైన్లను లైటింగ్స్ సొంతగా తయారు చేశారు. పట్టణ ప్రజలకు సుపరిచితమైన గణేష్ సౌండ్స్ సంప్రదించదలిచిన వారు +91 99514 24008ను సంప్రదించవచ్చు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు