హోమ్ /వార్తలు /తెలంగాణ /

Super Teacher: ప్రయోగాల ద్వారా పాఠాలు.. ఇటువంటి మాస్టారు ఉంటే ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారమే

Super Teacher: ప్రయోగాల ద్వారా పాఠాలు.. ఇటువంటి మాస్టారు ఉంటే ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారమే

టీచర్​

టీచర్​

పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించి వారి భవిష్యత్తుకు పునాదులు వేసేది పాఠశాల విద్య. అయితే కేవలం పుస్తకాల్లోని పాఠాలను గంటల తరబడి తరగతి గదిలో కూర్చోబెట్టి బోధించడం వలన ఆ పాఠాలు విద్యార్థులకు ఎంత మేర అర్ధం అవుతున్నాయన్న విషయం అర్ధం కాదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (N. Naveen Kumar, News18, Nagarkurnool)పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించి వారి భవిష్యత్తుకు పునాదులు వేసేది పాఠశాల విద్య (School Education). అయితే కేవలం పుస్తకాల్లోని పాఠాలను గంటల తరబడి తరగతి గదిలో కూర్చోబెట్టి బోధించడం వలన ఆ పాఠాలు విద్యార్థులకు ఎంత మేర అర్ధం అవుతున్నాయన్న విషయం అర్ధం కాదు. అంతే కాదు విద్యార్థుల ఆలోచన, ఊహాశక్తి తగ్గిపోయి చదువుల్లో వెనుకబడిపోయే అవకాశము ఉంది. ఇదే విషయంపై ఆలోచనలో పడ్డ ఓ మాస్టారు (Master) వినూత్న పద్దతిలో తమ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
  ప్రకృతి అనుసంధానంతో విద్యార్థులకు పాఠాలు:
  విద్యార్థులకు (Students) ప్రయోగాల ద్వారా ప్రయోగాల పాఠాలు బోధించడం (Teaching) ద్వారా సులభంగా అర్థం చేయొచ్చనే ఉద్దేశంతో ఉపాధ్యాయుడు(Teacher)  వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తున్నారు. భూ స్వరూపాలపై సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి పాఠాన్ని, ప్రయోగాల ద్వారా విద్యార్థుల కళ్ళకు కట్టినట్లు బోధించారు ఉపాధ్యాయుడు కె. ప్రహ్లద్ (K Prahlad). జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చింతలకుంట పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కె.ప్రహ్లద్..పాఠాలు (Lessons) భోదించడంలో తనదైన ముద్ర వేస్తున్నారు.


  వినూత్న పద్ధతిలో..
  క్లిష్టమైన పాఠాలను సైతం విద్యార్థులకు అర్ధమయ్యేలా ప్రయోగాల (Practical's) ద్వారా కళ్ళకు కట్టినట్లు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు ఆ పాఠాలు ఎక్కువ రోజులు గుర్తుంటాయని ఉపాధ్యాయుడు తెలిపారు. వినూత్న పద్ధతిలో పాఠాలను బోధించడంతో విద్యార్థులు ఆసక్తిగా పాఠాలు (Lessons) వింటున్నారు. ప్రహ్లాద్ తాను డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఈ విధానాన్ని పుస్తకంలో చదివానని, ప్రయోగాల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబితే సులభంగా అర్థం అవుతుందని అంటున్నారు.
  ఉపాధ్యాయుడు ప్రహ్లద్ గురించి తెలుసుకుని న్యూస్ 18 ప్రతినిధి పాఠశాలకు చేరుకోగా అప్పటికే ఒక ప్రయోగంతో పాఠం చెబుతున్నారు ఆయన. నదీ ప్రవాహాలు, చెరువులు, కాలువల ద్వారా ప్రవహించే నీరు సముద్రాన్ని ఏ విధంగా చేరుకుంటాయో తెలిపే ప్రయోగం అది. ఒక నది తాను పుట్టిన ప్రదేశం నుంచి సముద్రంలో కలిసేంతవరకు ఎలా ప్రవహిస్తుంది, భూస్వరూపాన్ని ఏ విధంగా ఆ నదీ ప్రవాహం మారుస్తుంది అనే విషయాలను కంటికి కట్టినట్లుగా చూపించారు. పాఠశాల ఆవరణంలోనే మట్టితో ఒక సూక్ష్మ నిర్మాణం చేపట్టి గుట్టలు కొండలు నదీ కాలువల నమూనాలు ఏర్పాటు చేశారు.
  Yamaha RX 100 : ఆర్‌ఎక్స్ 100 కావాలా? అయితే ఇక్కడికి రండి: ఈ మెకానిక్ అదిరిపోయేలా తయారు చేసిస్తాడు..
  నదీ ప్రవాహం ఏ విధంగా ఉంటుందో వివరిస్తూ నీటిని ఒక కొండ అంచుపై నుంచి పోసి చివరికి చేరుకునే వరకు ఆ నీరు భూస్వరూపాన్ని ఏ విధంగా మారుస్తుంది, ఏ విధంగా భూమిని చీలుస్తుంది, కొండలను ఏ విధంగా కోతకు గురిచేస్తుంది అనే విషయాలు విద్యార్థులకు వివరించారు. దీంతో పాటు సముద్రంలో ఏ విధంగా ఆ నీరు చేరుతుంది అనే అంశాలను విద్యార్థులకు చూపించారు. ఈ పాఠాలను విన్న విద్యార్థులు కొత్త అనుభూతికి లోనయ్యారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Nagarkurnool, Teaching

  ఉత్తమ కథలు