హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: రైతులకు ఇది నిజంగా వరం.. పంటను కాపాడే డివైజ్.. వివరాలివే..!

Nagar Kurnool: రైతులకు ఇది నిజంగా వరం.. పంటను కాపాడే డివైజ్.. వివరాలివే..!

X
రైతుల

రైతుల కోసం సరికొత్త పరికరం

Nagar Kurnool: వరి పంటకు నిర్ణిత స్థాయి కంటే ఎక్కువ మోతాదులో నీటిని అందిస్తే పంట ద్వారా భయంకరమైన మీథెన్ వాయువు విడుదల అవుతుంది. దీని ద్వారా కాలుష్యం పెరిగి పంట దిగుబడి తగ్గడం, చెదలు పట్టడం వంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Mahbubnagar (Mahabubnagar) | Andhra Pradesh

Naveen Kumar, News18, Nagarkurnool

వరి పంటకు నిర్ణిత స్థాయి కంటే ఎక్కువ మోతాదులో నీటిని అందిస్తే పంట ద్వారా భయంకరమైన మీథెన్ వాయువు విడుదల అవుతుంది. దీని ద్వారా కాలుష్యం పెరిగి పంట దిగుబడి తగ్గడం, చెదలు పట్టడం వంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. పంట నష్టంతోపాటు వాతావరణం అధికంగా కాలుష్యం అవుతుంది. కేవలం పంట వేర్లకు మాత్రమే నీరు అందించాల్సి ఉంటుంది. కాండానికి కాదు సాధారణంగా చాలా వరకు వరి పంటలు కాండం వరకు కూడా నీరు నిల్వ ఉంటుంది. దీని వలన పంట ఏపుగా పెరగడం తగ్గిపోయి దిగుబడి కూడా తగ్గుతుంది. అయితే ఇలాంటి నష్టాలనుంచి రైతులు పంటను కాపాడుకునేందుకు స్వామి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు చిన్నపాటి పరికరాన్ని కనుగొన్నారు.

ఈ పరికరం ద్వారా వరి పంట నీటిని నిర్ణిత స్థాయి వరకు మాత్రమే నీటిని అందించాలని వివరించారు. ఇందుకుసంబంధించిన వివరాలను ఈ సంస్థ మేనేజర్ గౌస్ మియా అన్ని వివరాలు తెలిపారు. రైతులు పంట పొలాల్లో పైపులాంటి ఈ పరికరాన్ని అమర్చి వాటికి ఉన్నటువంటి రంద్రాల్లో సగభాగం వరకు మాత్రమే నీళ్లు నిలిచేలా చేసుకుంటే పంటకు కావలసినంత నీరు అందుతుందని వివరించారు.

ఇది చదవండి: ఇలాగైతే ఎలా..? అధికారులకు పరుగులు పెట్టించిన కలెక్టర్

రైతులు పడిన కష్టానికి సరైన దిగుబడి రావాలంటే ఇలాంటి పరికరాన్ని ఉపయోగించాలని తెలిపారు. దీనిని తమ సంస్థ రైతులకుఉచితంగా అందిస్తున్నామని చెప్పుకోచ్చారు. తమ సంస్థ ఉద్యోగులను సంప్రదించి ఫోన్ ద్వారావివరాలు తెలిపితే తమ కోఆర్డినేటర్ అక్కడికి చేరుకొని ఈ పరికరాన్ని ఏ విధంగా వినియోగించాలి. పంటలు నీటిని ఏ మేరకు నిల్వ ఉంచాలి అనే అంశాలను వివరిస్తారని చెప్పుకొచ్చారు.

దీంతో పాటు ఈ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులకు వారి అకౌంట్లో 400 రూపాయల ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని తెలిపారు. గ్రామీణ స్థాయిలో పంటల ద్వారా విడుదల అవుతున్న భయంకరమైన మీథేన్ శాతాన్ని తగ్గించడానికి తమ సంస్థ దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. కార్బన్ డైయాక్సైడ్ కంటే విషపూరితమైన మీథేన్ వాయువు దీని ద్వారా విడుదల అవుతుందని చెప్పారు. తాము అందించే పరికరం ద్వారా రైతులుకాలుష్యాన్ని తగ్గించడంతోపాటు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వీలు ఉంటుందని వివరించారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు