హోమ్ /వార్తలు /తెలంగాణ /

‘అంగవైకల్యం నన్ను అడ్డుకోలేకపోయింది..!’ ఈ టీచర్ సక్సెస్ స్టోరీ మీరే చూడండి..!

‘అంగవైకల్యం నన్ను అడ్డుకోలేకపోయింది..!’ ఈ టీచర్ సక్సెస్ స్టోరీ మీరే చూడండి..!

X
స్ఫూర్తినిస్తున్న

స్ఫూర్తినిస్తున్న టీచర్ సుదర్శన్ లైఫ్ స్టోరీ

నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కేంద్రంలో రామాలయం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న సుదర్శన్ గురించి న్యూస్ 18 ప్రత్యేక కథనం అందిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Mahbubnagar (Mahabubnagar) | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కేంద్రంలో రామాలయం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న సుదర్శన్ గురించి న్యూస్ 18 ప్రత్యేక కథనం అందిస్తోంది. ఆయన ఒక అందుడు. చిన్నతనంలో ఐదు నెలల వయసు ఉన్నప్పుడు కళ్ళల్లో ఏదో వ్యాధి వచ్చిందని తన కుటుంబ సభ్యులు నాటు మందులు ఉపయోగించడం వల్ల రెండు కళ్ళు దెబ్బతిని పూర్తిగా చూపులు కోల్పోయాడు. ఏడు సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నటువంటి సుదర్శన్ బ్రెయిలీ లిపిని చదువుకునేందుకు హైదరాబాద్ (Hyderabad) వెళ్లాడు. అక్కడ మలక్ పేటలోని అంధుల పాఠశాలలో 10వ తరగతి వరకు బ్రైలి లిపి ద్వారా చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు పూర్తి చేశాడు. ప్రభుత్వం ఉపాద్యాయ ఉద్యోగాన్ని ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఓపెన్ క్యాటగిరి లో సాధించాడు.
తన లక్ష్యానికి అంగవైకల్యం అడ్డురాలేదు

తన అంగవైకల్యం అడుగడుగునా అడ్డుకుంటున్న వాటిని అధిగమిస్తూ లక్షాన్ని సాధించాడు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయం ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 5వ తరగతి విద్యార్థులకు తెలుగు, సాంఘికం, సామాన్యం వంటి పాటలను బోధిస్తున్నారు. బ్రెయిలీలిపి ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక పుస్తకాల సహకరంతో పిల్లలకు పాఠాలను అర్థమయ్యేలా ఇంగ్లీషులో బోధనలు చేపడుతున్నారు.

ఇది చదవండి: విలువిద్యలో రాణిస్తున్న కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

బ్రెయిలీ లిపి ద్వారా పాఠాలు

బ్రెయిలీ లిపి ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో పాఠాలు చెప్తానని వివరించారు. తాను వ్యక్తిగత జీవితంలో నేటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సమాజం చులకనగా చూడటం లేదా జాలి పడడం వంటివి చేయడం వలన ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ తమ అంగవైకల్యాన్ని సమాజం ఎప్పుడు వేలెత్తి చూపుతూనే ఉంటుందని వివరించారు.

ఇది చదవండి: అవయవదానం చేసి... మానవత్వం చాటుకుంటున్న ఆ గ్రామస్తులు

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

సమాజంలో మార్పు వస్తేనే అంగవైకల్యం ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు వెళ్లగలరని సూచించారు. అంగవైకల్యం నిత్యం వేధిస్తున్నప్పటికీ తన కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారంతో తన సాధారణ జీవితాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిపేస్తున్నానని తెలుపుకొచ్చారు.

ఇది చదవండి: పుట్టుకతోనే చీకట్లు కమ్మేసిన జీవితం, ఇతని సంకల్పానికి విధి కూడా తలవంచింది.!

కలలు వస్తుంటాయి

తనకు అప్పుడప్పుడు కలలు వస్తుంటాయని ఆ కలలో వ్యక్తుల మాటల తప్ప ఆకారం కనిపించదని తెలిపారు. చిన్నతనం నుంచి ఎలాంటి చూపును నోచుకోలేదు కాబట్టి కేవలం వ్యక్తుల మాటలు మాత్రమే వినిపిస్తాయని ఎలాంటి ఆకారం కానీ రంగులు కానీ కనిపించని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నోట్లను అమలులోకి తీసుకురావడం అంధులకు ఇబ్బందిగా మారిందని వివరించారు.

కరెన్సీ నోట్లు గుర్తించలేకపోతున్నాం

ప్రస్తుతం ఉన్న కొత్త నోట్లు అన్ని దాదాపుగా ఒకే సైజు ఉండడం వల్ల వాటిని గుర్తించడం కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పుకొచ్చారు. వీటిపై నేషనల్ బ్లైండ్ అకాడమీ వాళ్లు ఢిల్లీలో పోరాటం చేపడుతున్నారని అందరికీ అందుబాటులో ఉండే విధంగా నోట్లను ముద్రించాలని చెప్పుకొచ్చారు.

First published:

Tags: Local News, Nagarkarnol district, Telangana

ఉత్తమ కథలు