Home /News /telangana /

NAGAR KURNOOL THIEVES STOLE 8 LAKH RUPEES FROM SHEPHERD IN NAGARKURNOOL DISTRICT POLICE FILE COMPLAINT NNK BRV PRV

Nagarkurnool: గొర్రెలు అమ్మిన సొమ్ము దొంగల పాలు: పట్టపగలే గొర్రెల కాపరి ఇంట్లో భారీ చోరీ

ఆత్మకూరు పోలీసు స్టేషన్

ఆత్మకూరు పోలీసు స్టేషన్

ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం తనకున్న గొర్రెలను విక్రయించగా రూ 8.50 లక్షలు వచ్చాయి. అయితే అతను ఇంట్లో పెట్టాడు. అయితే అతన్ని దొంగలు ఏ ప్రాంతంలో కనిపెట్టారో కానీ, పక్కా స్కెచ్​ గీశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India
  (N. Naveen kumar, News 18, Nagarkurnool)

  వనపర్తి (Vanaparti) జిల్లా ఆత్మకూరు మండలంలో పట్టపగలే చోరీ (Theft) జరిగింది. తిప్పడంపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.8.50 లక్షలు ఎత్తుకెళ్లినట్టు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. ఆయన కథనం మేరకు గ్రామానికి చెందిన గొల్ల కాటే అనే వ్యక్తి వ్యవసాయంతో పాటు గొర్రెల వ్యాపారం (Sheeps Business) చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం తనకున్న గొర్రెలను విక్రయించగా రూ 8.50 లక్షలు వచ్చాయి. వాటిని బీరువాలో భద్రపరిచి సొంత పని నిమిత్తం ఆత్మకూరుకు వెళ్లారు. అతడి భార్య వ్యవసాయ పనులకు వెళ్లగా, ఇద్దరు కుమార్తెలు గాంధీ సినిమా చూసేందుకు పాఠశాల నుంచి ఆత్మకురు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కుమార్తెలు బీరువా తాళం పగలగొట్టి ఉండడాన్ని గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రత్నం, అమరచింత ఎస్ఐలు రాఘవేందర్, జయన్న గౌడ్, డాగ్స్ స్క్వాడ్ బృందం వెంకటరమణ స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కష్టపడి సంపాదించినా ధనం దొంగల పాలు కావడంపై బాధితులు లబోదిబోమంటున్నారు.

  మురుగు గుంతలో పడి బాలుడు మృతి:

  ఆడుకుంటూ వెళ్లి మురుగు గుంతలో పడి మూడేళ్ళ బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా మద్దూరు మండలం నిడిజింతల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఎక్కమెడ్ గ్రామానికి చెందిన కాశమ్మ పీర్ల పండుగ సందర్భంగా తల్లిగారి ఊరైన నిడిజింతల వచ్చింది. గురువారం ఉదయం ఆమె కుమారుడు విష్ణు (3) ఇంటి బయట ఆడుకుంటూ సమీపంలో ఉన్న మురుగుంత నీటిలో పడిపోయాడు. బాలుడు కనిపించడం లేదని వెతకగా మురుగు గుంతలో విగత జీవిగా పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  Nagarkurnool: అడవిలో చెట్టుకు వేలాడిన బాలిక డెడ్ బాడీ.. మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. అతడే చేశాడా..?

  చీటీ డబ్బులు వ్యవహారంలో మహిళ బలవన్మరణం:

  చీటీ డబ్బులు వ్యవహారంలో స్యూరిటీ సంతకం చేసిన ఓ మహిళ.. అనంతరం జరిగిన పరిణామాలు తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ రమేష్ బాబు తెలిపిన కథనం మేరకు గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి (28) ఓ వ్యక్తి దగ్గర రూ. 5 లక్షల చిట్టి వేసింది. సభ్యుల్లో ఒకరు చీటీ ఎత్తుకోగా స్యూరిటీ సంతకం చేసింది. చీటీ తీసుకున్న సభ్యురాలు సక్రమంగా డబ్బులు చెల్లించకపోవడంతో ఈ విషయం తన భర్తకు తెలుస్తుందని భయాందోళనలో తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో మనస్థాపానికి గురైన రాజ్యలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రాజ్యలక్ష్మికి భర్త నాగరాజు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


  పూజ సామాగ్రి చెరువులో వేయడానికి వెళ్లి మృత్యువాత:

  పూజ అనంతరం సామాగ్రిని చెరువులో వదిలి వెళ్లేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగిరికి చెందిన వర్ధన్ శివరాజ్ (33) మేస్త్రి పని చేసేవాడు. బుధవారం బండ్లగిరిలో నూతన గృహప్రవేశం చేసి స్వామి వ్రతం చేశారు. పూజ అనంతరం వ్యర్ధ సామాగ్రిని చెరువులో వేసేందుకు బంధువు ప్రేమ్‌తో కలిసి ఆటోలో వెంకటాపురం చెరువు వద్దకు వెళ్లారు. ఈక్రమంలో శివరాజ్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయాడు. గమనించిన ప్రేమ్... కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. స్థానికంగా ఉండే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని శివరాజ్ మృత్తదేహాన్ని వెలికి తీశారు. కొత్తగా గృహప్రవేశం చేసుకున్న ఆ ఇంట్లో తీవ్ర విషాద గాయాలు అలుముకున్నాయి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త మరణం పై ఎలాంటి అనుమానం లేదని భార్య బాలమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Local News, Nagarkurnool, Theft

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు