హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఇక్కడ బీజేపీలో అంతర్గత కుమ్ములాట.. కార్యకర్తల ముందే దుర్భాష!..

ఇక్కడ బీజేపీలో అంతర్గత కుమ్ములాట.. కార్యకర్తల ముందే దుర్భాష!..

అంతర్గత కలహాలు

అంతర్గత కలహాలు

Telangana: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతో కొంత బీజేపీ పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో జడ్చర్ల నియోజకవర్గం ఒకటి. గత మూడేళ్ల క్రితం ఈ పార్టీ ఛాయలు లేకున్నప్పటికీ ప్రస్తుతం నెమ్మది నెమ్మదిగా బిజెపి పార్టీ జడ్చర్లలో పుంజుకుంటూ వస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతో కొంత బీజేపీ పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో జడ్చర్ల నియోజకవర్గం ఒకటి. గత మూడేళ్ల క్రితం ఈ పార్టీ ఛాయలు లేకున్నప్పటికీ ప్రస్తుతం నెమ్మది నెమ్మదిగా బిజెపి పార్టీ జడ్చర్లలో పుంజుకుంటూ వస్తుంది. తరచూ ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ కార్యక్రమాలను చురుకుగా చేపడుతూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త గాడిలో పడుతున్న బిజెపి పార్టీ నాయకుల్లో అప్పుడే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.

ప్రోటోకాల్ విషయంలో, రాజకీయ ప్రాధాన్యత విషయంలో నాయకుల మధ్య వాగ్వాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలు బిజెపి కౌన్సిలర్ కుమ్మరి రాజుకు, బిజెపి నాయకురాలు బాలా త్రిపుర సుందరికి మధ్య చెలరేగిన వివాదం హాట్ టాపిక్ గా మారింది.

అధికార పార్టీకి ధీటుగా బిజెపిని బలోపేతం చేయాల్సిన నాయకుల మధ్య ఆదిపత్య పోరు సాగుతుంది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో బిజెపి కార్యకర్తలు అభిమానులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. నియోజకవర్గంలో నామమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితిమూడు సంవత్సరాలు నుంచి కొంత మెరుగుపడుతూ వస్తున్నప్పటికీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా పార్టీ పరిస్థితులు ఉంటున్నాయి.

రాష్ట్రస్థాయి నేతలు జడ్చర్ల నియోజకవర్గంలో తమ బలగాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నంలో గ్రూపులు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఉన్న కొద్దిమంది నాయకులను, పార్టీని భాగాలుగా చేసుకొని ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గానికి చెందిన నాయకులకు జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల అండదండలు ఉండడంతో ఎవరికి వారు కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఒకచోట పార్టీ కార్యక్రమాలు నిర్వహించగా మరో ప్రాంతానికి చెందిన వారు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా వేదిక వద్ద కూర్చునే స్థలం విషయంపై మున్సిపల్ కౌన్సిలర్ కుమ్మరి రాజు, బిజెపి నాయకురాలు బాలా త్రిపుర సుందరి మధ్య వాదన జరిగింది. ఈ వాదన తీవ్ర అసభ్యకరమాటలతో సాగడంతో ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులు విస్మయానికి గురిచేసింది.

పార్టీ ముఖ్య నాయకులు కొందరు కల్పించుకొని ఇరువురిని శాంతింప చేశారు. బాలా త్రిపుర సుందరి తనను అవమానించిందని ఆరోపిస్తూ జిల్లా నేతలకు ఫిర్యాదు చేయగా తనను పలు సందర్భాల్లో అవమాన పరుస్తున్నారని బాల త్రిపుర సుందరి ఆరోపిస్తుంది. పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నాయకుల మధ్య సఖ్యతను కుదిర్చి పార్టీని బలోపేతం చేయాలని పలువురు నాయకులు కార్యకర్తలు సూచిస్తున్నారు.

First published:

Tags: Bjp, Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు