హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన యజమాని.. తాళం తీయకుండానే షాకింగ్ సీన్.. లోపలికెళ్లి చూస్తే..!

ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన యజమాని.. తాళం తీయకుండానే షాకింగ్ సీన్.. లోపలికెళ్లి చూస్తే..!

నాగర్ కర్నూల్ లో వరుస చోరీలు

నాగర్ కర్నూల్ లో వరుస చోరీలు

Nagar Kurnool: ఈజీ మనీకి అలవాటుపడుతున్న దొంగలముఠాలు యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నాయి. పెద్దపెద్ద షాపుల నుంచి చిన్నచిన్న షాపుల వరకు అందినకాడికి దోచుకెళ్తున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ లో వరుస దొంగతనాలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahabubabad | Telangana

  N.Naveen kumar, News 18, NagarKurnool


  ఈజీ మనీకి అలవాటుపడుతున్న దొంగలముఠాలు యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నాయి. పెద్దపెద్ద షాపుల నుంచి చిన్నచిన్న షాపుల వరకు అందినకాడికి దోచుకెళ్తున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ (Nagar Kurnool) లో వరుస దొంగతనాలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నాగర్‌ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఒకేరోజు మూడు దుకాణాల్లో చోరి జరిగింది.ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యా ఫర్టిలైజర్స్, ఇఫ్కో ట్రేడర్స్, లక్ష్మీ సీడర్స్‌ దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గురువారం షాపు తెరిచేందుకు వచ్చిన యజమానులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు దుకాణాలను పరిశీలించారు. ఈ చోరీ ఘటనలో లక్ష్మీ ట్రేడర్స్‌లో యజమాని దాచిన రెండున్నర తులాల బంగారంతో పాటు రూ. 20 వేల నగదు మిగతా షాపుల్లో మొత్తం కలిపి రూ. 65 వేల నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


  అన్న హత్య కేసులో తమ్ముడికి జీవిత ఖైదు
  మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించింది కోర్టు. జడ్చర్ల సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం గంగాపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల రవి, నరసింహుడు సొంత అన్నదమ్ములు. ఇరువురి మధ్య తరచూ తగాదాలు జరుగుతుండేవి. 2013 జనవరిలో వ్యవసాయ పనులకు వెళ్లిన అన్నదమ్ములు గొడవపడ్డారు. అన్న రవిపై తమ్ముడు నరసింహులు కర్రతో దాడి చేయగా రవి మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరసింహులును రిమాండ్‌కి తరలించారు. నిందితుడుహైకోర్టును ఆశ్రయించగా కేసును పునర్విచారణ చేయాలని హైకోర్టు జిల్లా కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరిగి కేసు విచారణ చేపట్టిన జిల్లా కోర్టు...నిందితుడు నరసింహులుకుజీవిత ఖైదు విధిస్తున్నట్టు గురువారం తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించి న్యాయవాది ప్రదేశ్ పోలీసులు తరఫున వాదనలు వినిపించారు.  ఇది చదవండి: ఈ లిక్కర్ లో వాటర్ కలపాల్సిన పనిలేదు.. మాయగాళ్ల అతితెలివి అంతే మరి..


  నాలుగు కంకర టిప్పర్లు, రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

  నాగర్‌కర్నూల్ జిల్లాలో కంకర తరలిస్తున్న నాలుగు టిపర్లను, ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను గురువారం రాత్రి సీజ్ చేసి జరిమానా విధించినట్లు జిల్లా మైనింగ్ అధికారి విజయ రామారాజు తెలిపారు.గుడిపల్లి గ్రామం నుంచి నాగర్‌కర్నూల్‌కు అక్రమంగా కంకర, ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఒక్కో టిప్పర్‌కు రూ. 10 వేలు చొప్పున నాలుగు టిప్పర్లకు రూ. 40 వేలు, రెండు ట్రాక్టర్లకు కలిపి రూ. 10 వేలు జరిమానా జరిమానా విధించినట్లు విజయ రామరాజు తెలిపారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు