హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: జోరుగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు.. రైతులను బురిడీ కొట్టిస్తున్న దళారులు

Nagarkurnool: జోరుగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు.. రైతులను బురిడీ కొట్టిస్తున్న దళారులు

X
దళారుల

దళారుల నుంచి జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

Telangana: నాగర్ కర్నూల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతుంది. ప్రభుత్వం మార్కెట్లలో వీటితో పాటు ఐకేవి సెంటర్లను ఏర్పాటు చేసి గ్రామాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

N.Naveen Kumar, News18, Nagarkurnool

నాగర్ కర్నూల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతుంది. ప్రభుత్వం మార్కెట్లలో వీటితో పాటు ఐకేవి సెంటర్లను ఏర్పాటు చేసి గ్రామాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అయితే అక్కడక్కడ మారుమూల గ్రామంలో కొందరు రైతులు దళారుల చేతిలో మెకేసపోతున్నారని తెలుస్తుంది. మార్కెట్ యార్డ్ కి ధాన్యాన్ని తరలించే క్రమంలో కొందరు దళారులు రైతుల ఇంటి దగ్గరికి చేరుకొని అక్కడే కొనుగోలు చేస్తూ వారిని మోసం చేస్తున్నట్టుగా రైతులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం ఎంఎస్పీ ధర రూ.2060 ఉండగా కొంతమంది దళారులు గ్రామాల ప్రాంతాలకు వెళ్లి రూ.1800 రూ. 1900కు మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇదే అంశంపై మార్కెటింగ్ శాఖ అధికారులను న్యూస్ 18 సంప్రదించగా మార్కెట్ యార్డ్ పరిధిలోని దళారులు ఎలాంటి అవకతవకలకు పాల్పడం లేదని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని నాగర్ కర్నూల్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని బాలమని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 220 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 1,22,500 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా వీటి ద్వారా ఈ ఏడాది 3 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

ఈ ధాన్యంలో 2 లక్షల క్వింటాళ్ల కొనుగోలు చేసేందుకు టార్గెట్ విధించుకున్నామని చెప్పారు. ఆర్ ఎన్ ఆర్ ధాన్యానికి మద్దతు ధర రూ. 2060 ఉండగా సన్న రకాలకు రూ. 2200 వరకు ధర పలుకుతుందని వివరించారు. రైతులు ఎవరూ కూడా దళారులను నమ్మి మోసపోకూడదని సూచించారు. కొంతమంది రైతులు మార్కెట్ యార్డ్ కు అదే విధంగా ఐకెపి సెంటర్లకు ధాన్యాన్ని తీసుకు వచ్చేందుకు రవాణా ఖర్చులు అధికమైతాయని భావించి గ్రామాల్లోని విక్రయించేందుకు ప్రయత్నిస్తారు. వీటిని ఆసరాగా చేసుకున్న కొంతమంది దళారులు గ్రామాల్లో రైతుల ఇంటి దగ్గరికి చేరుకొని ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కాంటాల్లో తేడా రావడం ఎమ్ఎస్పీ ధర కంటే తక్కువ ధర చెల్లించడం వంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి.

రైతులు తప్పనిసరిగా మార్కెట్ యార్డ్ కి ధాన్యాన్ని తీసుకురావాలని తెలిపారు. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్ లో నాలుగు కోట్ల కిలోల ధాన్యాన్ని సేకరించాలని టార్గెట్ నిర్ణయించుకోగా ఇప్పటివరకు 10 కోట్ల కిలోల వరకు ధాన్యాన్ని సేకరించామని మార్కెట్ యార్డ్ శాఖ అధికారులు తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ యార్డులో అన్ని సదుపాయాలను చేపట్టామని వివరించారు. కావాల్సినటువంటి గన్ని బ్యాగులను ధాన్యం తడవకుండా ఉంచేందుకు అన్నింటిని సిద్ధం చేశామని వివరించారు. రైతులు విశ్రాంతి తీసుకునేందుకు వారికి భోజనాలు చేసేందుకు సకల ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు