హోమ్ /వార్తలు /తెలంగాణ /

సిద్ధమైన నూతన కలెక్టరేట్ భవనం.. ఎటు చూసినా పచ్చదనమే!..

సిద్ధమైన నూతన కలెక్టరేట్ భవనం.. ఎటు చూసినా పచ్చదనమే!..

X
నూతనంగా

నూతనంగా కన్పించబోతున్న కలెక్టరేట్..

Telangana: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ భవనం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. భవనం ఆవరణలో గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ పనులు కొనసాగుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ భవనం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. భవనం ఆవరణలో గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ పనులు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ ప్రాంగణం అంతా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా అధికారులు కృషి చేస్తున్నారు. కలెక్టరేట్ ముందు పూర్తిగా గ్రీనరీతో నిండి ఉండేలా పూల మొక్కలు, చెట్ల మొక్కలు, పండ్ల మొక్కలను పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

కలెక్టరేట్కు వివిధ రకాల పనుల కోసం వచ్చే ప్రజలు సేద తీరడానికి నీడనిచ్ఛే చెట్లను అధికంగా పెంచాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు సలహాలు అందజేశారు. కొల్లాపూర్ చౌరస్తా నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని నూతన కలెక్టరేట్‌ బ్యూటిఫికేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అటవీ శాఖ, హార్టికల్చర్ అధికారితో సమన్వయం చేసుకొని పండ్లు, ఇతర పూల మొక్కల నాటే ప్రక్రియనువారంలో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకుని పూర్తి చేయాలన్నారు.ఆవరణలో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ దట్టమైన గ్రీనరీ ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లాఅధికారులను ఆదేశించారు. ఏ రకమైన మొక్కలను ఎక్కడ నాటాలి? మొక్కల సైజులను హార్టికల్చర్ అధికారితో చర్చించి వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఏప్రిల్ మాసంలో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు మొక్కల నాటే ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలం కనబడకుండా పండ్ల, పూల మొక్కలతో సుందరీకరణ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రానున్న వారం రోజుల్లో అన్ని పనులు పూర్తయ్యేలా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చిన్న చిన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సుందరీకరణ పనుల పురోగతిపై అధిక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మను చౌదరి, అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర రావు, ఆర్ అండ్ బి డిఈ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ యాదయ్య, ఇంజనీర్లు తదితరులుఉన్నారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు