Home /News /telangana /

NAGAR KURNOOL THE ELDER BROTHER ATTACKED THE YOUNGER BROTHER WITH KNIFE AND OTHER CRIME INCIDENST IN NAGARKURNOOL ABH BRV NNK

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో కత్తి దాడులు: క్రైమ్ రౌండప్

నాగర్‌కర్నూల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో కత్తి దాడులు: క్రైమ్ రౌండప్

నాగర్‌కర్నూల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో కత్తి దాడులు: క్రైమ్ రౌండప్

తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న, మద్యం ఇవ్వలేదని వ్యక్తిపై దాడి, నాగర్ కర్నూల్ పరిధిలో నేరాలు

    (N.Naveen Kumar, News 18, Nagarkurnool)

    నాగర్‌కర్నూల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో కత్తులతో దాడులు స్థానికంగా సంచలనం కలిగించాయి. ఆస్తి కోసం తమ్ముడు పై అన్న కత్తితో దాడి చేయగా, మరో ఘటనలో మద్యం అరువు ఇవ్వలేదని బెల్ట్ షాపు నిర్వాహకుడిపై ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

    తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న:
    ఆస్తికోసం తమ్ముడు మొగలాను అన్న హుస్సేన్ కత్తితో దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ మండలం నల్లవెల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హుస్సేన్, మోగలాలు తమకు వారసత్వంగా వచ్చిన భూమిని పంచుకొని విడివిడిగా కాపురం ఉంటున్నారు. అయితే తమ వ్యవసాయ పొలంలో పాత భావి ఉండడంతో ఆ స్థలం ఎవరూ పంచుకోకుండా అలాగే ఉంచారు. ఆ బావిని హుస్సేన్ పూడ్చి వేసి తమ పశువుల కోసం షెడ్డు నిర్మించుకున్నాడు. అయితే అందులో తనకు కూడా వాటా కావాలని మొగలాల తరచు గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం సేవించి వచ్చిన హుస్సేన్ తమ్ముడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో గాయపడిన మొగలాలను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

    కొండచిలువను పట్టుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు:
    వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లి గ్రామంలో భారీ కొండచిలువను పట్టుకున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తన బావి సమీపంలో కొండచిలువను గుర్తించి, దాన్ని పట్టుకునేందుకు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు మహేందర్.. చాకచక్యంగా పామును పట్టుకున్నారు. 20 అడుగుల పొడవున్న భారీ కొండచిలువను సురక్షితంగా అడవిలోకి వదిలేసారు. వ్యవసాయ పొలాల్లో కొంతకాలం నుంచి కొండచిలువలు ప్రత్యక్షమవడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పశువులపై దాడిచేసి చంపేస్తున్నాయని పలుమార్లు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.



    మద్యం ఇవ్వలేదని వ్యక్తిపై దాడి:

    అరువుకు మద్యం ఇవ్వలేదని ఓ యువకుడు బెల్ట్ షాప్ నిర్వాహకుడిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా చిన్న చింతకుంట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై భాగ్య లక్ష్మారెడ్డి తెలిపిన కథనం ప్రకారం లాల్కోట గ్రామంలో వెంకట రాములు గౌడ్ అనే వ్యక్తి అక్రమంగా బెల్ షాప్ నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దొబ్బలి మోహన్ బుధవారం మధ్యాహ్నం బెల్ట్ షాప్ యజమాని ఇంటికి వెళ్లి మద్యం అరువు ఇవ్వాలని కోరాడు. ఇందుకు వెంకట రాములు నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొంది. ఈక్రమంలో మోహన్ అర్ధరాత్రి సమయంలో వెంకట రాములు వద్దకు వచ్చి మరోసారి గొడవపడి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంకటరాములును మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. బాధితుని భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సీఐ రజిత రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagar kurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు