Home /News /telangana /

NAGAR KURNOOL TELANGANA ROBINHOOD PANDUGA SAYANNA LIFE HISTORY WHO IS THIS SAYANNA NNK BRV PRV

Nagarkurnool: తెలంగాణ రాబిన్​హుడ్​ "పండగ సాయన్న": ఆయన చరిత్ర ఇదే..

పండగ సాయన్న

పండగ సాయన్న

"పండగ సాయన్న" ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పేరు తెలియని వారుండరు. పేదల దేవుడు- భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పండగ సాయన్నను తెలంగాణ రాబిన్ హుడ్‌గా పిలుస్తారు

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India
  (N. Naveen kumar, News 18, Nagarkurnool)

  "పండగ సాయన్న (Panduga sayanna)" ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లాలో ఈ పేరు తెలియని వారుండరు. పేదల దేవుడు- భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పండగ సాయన్నను తెలంగాణ రాబిన్ హుడ్‌ (Telangana Robin Hud)గా పిలుస్తారు. శుక్రవారం సాయన్న జయంతి (Sayanna jayanti) వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుడిగా చరిత్రకు ఎక్కారు ఈ పండుగ సాయన్న. ఎవరు ఈ సాయన్న? ఎలాంటి పోరాటాలు చేశారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

  పేద ప్రజలకు పంచిపెట్టాడు..

  పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రజాకార్లు (Razakars) భూస్వాములతో పోరాడిన పండగ సాయన్న నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడు. పేదల దేవుడిగా చరిత్రకు ఎక్కారు. అణగారిన వర్గాల కోసం తన జీవితం సర్వస్వాన్ని త్యాగం చేశాడు. భూస్వాములు, పెద్దల దగ్గర ధాన్యాన్ని, ధనాన్ని దోచి పేద ప్రజలకు పంచిపెట్టాడు. పీడిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాయన్న పడిన తపన, వీరత్వం, త్యాగాలు నాటి సాహితీవేత్తలకు గాని పాలకులకు గాని కనిపించలేదు. వినిపించలేదు. అయితేనేమి సాయన్న జీవిత చరిత్ర ఘటనలు ప్రజల హృదయాలలో పాటలుగా నిలిచిపోయాయి.  తెలంగాణ ఉద్యమం (Telangana Movement) ప్రారంభమైనప్పటి నుంచి పలువురు సాయితీవేత్తలు, జర్నలిస్టులు సాయన్న జీవిత చరిత్రకు సంబంధించి అక్షర రూపం ఇచ్చారు. పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ ఇప్పటికీ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

  సాయన్న జీవిత చరిత్రపై పరిశోధనలు..

  పండుగ సాయన్న జయంతి వేడుకలు ఇప్పటికి పాలమూరు ప్రజలు నిర్వహించుకుంటున్నారు. ప్రముఖ న్యాయవాది బిక్కం జనార్ధన్ సాయన్న జీవిత చరిత్రను నవలగా రాయగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు కొందరు సాయన్న జీవిత చరిత్రపై పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలు పొందారు. వీటితోపాటు మరికొంతమంది సాయన్న చరిత్రను పూర్తి స్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

  Peddapalli: దేవుడు లేని గుడి: అయినా అక్కడికి ప్రజలు ఎందుకు బారులు తీరుతున్నారు?

  పండగ సాయన్న జీవిత చరిత్ర:

  పండగ సాయన్న 370 ఏళ్ల క్రితం ప్రస్తుతం ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కేశవరావుపల్లి గ్రామ సమీపంలోని మోరుగొనిపల్లి గ్రామంలో సాయమ్మ, అనంతయ్య దంపతులకు జన్మించినట్టు జానపద కళాకారుల ద్వారా, ఒగ్గు కళాకారుల కథల ద్వారా తెలిసింది. కీ.శ. 1650లో పుట్టిన ఆయన 1707 వ సంవత్సరంలో మరణించినట్టుగా కొందరు చరిత్రకారులు చెప్పుకొచ్చారు. భీమునిగా, సాహసవంతునిగా ఉన్న సాయన్న పశువుల కాపరిగా పనిచేస్తుండేవాడు. అప్పటి కాలంలో రజాకారుల పాలనలో భూస్వాముల ఆధిపత్యం గ్రామాల్లో ఎక్కువగా సాగేది. సాయన్న కుటుంబం తమకున్న కొద్దిపాటి వ్యవసాయ పొలంలో బావిని తవ్వుకొని వ్యవసాయం చేయడం, పంటలు బాగా పండుతున్న తరుణంలో పెత్తందారులు ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేశారు. సాయన్నకు చెందిన భూములను, భూస్వాములు స్వాధీనం చేసుకోవడంతో ఆనాటి నుంచే సాయన్న తిరుగుబాటు ప్రారంభించారు.

  పెత్తందారులను ఎదిరించడం, భూస్వాముల ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడడం, తెచ్చిన ధాన్యాన్ని పేదలకు పంచడం, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు సహాయం చేయడం వంటి పనులు చేస్తూ అప్పటి పాలకులకు, పోలీసు యంత్రాంగానికి నిద్రలేకుండా చేశారు. నవాబుపేట మండలంలో ప్రస్తుతం ఉన్న ఏపూరి మైసమ్మ దేవాలయం వద్ద బోనాలు ఏర్పాటుచేసి చీరలు అందించి, భోజనాలు ఏర్పాటు చేసినట్లు శయనం గురించి కథలు ప్రచారంలో ఉండేవి. రోజురోజుకు ఆయన పట్ల ప్రజలలో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక ఎలాగైనా సాయనకు అంతం చేయాలని భూస్వాములు పెత్తందారులు నిజాం సైన్యంకు సమాచారం అందించారు.

  నిజాం సైనికుల నుంచి తప్పించుకోవడానికి నల్లమల అడవిలోకి వెళ్లిన సాయన్న అక్కడ మరికొందరితో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సాయన్న తన కార్యకలాపాలకను కొనసాగించేవారు. ఈ విషయం పసిగట్టిన నిజాం సైన్యం... సాయన్నను బంధించారు. విషయం తెలుసుకున్న ప్రజలు అప్పట్లో వనపర్తి మహారాణి శంకరమ్మను కలుసుకుని ఎలాగైనా సాయన్నను విడిపించాలని విజ్ఞప్తి చేయగా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ దేవుని గుట్ట వద్ద సాయన్నను బంధించి.. శిరచ్ఛేదన చేశారు. సాయన్న తల్లి తన కుమారుడి హత్యను చూసి తల్లడిల్లిపోయింది. తలను హన్వాడ మండలంలోని దాచేపల్లి గ్రామంలో సమాధి చేసింది. మొండెంను ప్రజలు తిరుమలయ్య దేవుని గుట్ట వద్దనే పూడ్చి సమాధి కట్టి.. కాలక్రమేణా గుడి కట్టారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Mahbubnagar, Nagarkurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు