Naveen Kumar, News18, Nagarkurnool
రైతులకు వ్యవసాయంలో అదునూతన టెక్నాలజీని అందించేందుకు ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో రైతు నేల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శల గుప్పించారు. తెలంగాణ ప్రజలకు వరి అన్నం తినడం తెలియదని అన్న మాటలకు కౌంటర్ వేశారు. ఒక మూర్ఖుడు తెలంగాణకు ఎన్టీఆర్ పరిపాలించే వరకు వరి అన్నం తెలియదు అంటున్నాడని మండిపడ్డ మంత్రి.. అంతటి మూర్ఖున్ని ఎక్కడా చూడలేదన్నారు.
పూర్వం 1100, 1200 ఏళ్ల క్రితమే తెలంగాణలో వరి సాగయిందని వివరించిన మంత్రి.. దానికి కొనసాగింపు కాకతీయ, రెడ్డి రాజుల కాలంలో గొలుసుకట్టు చెరువుల కింద వరి సాగయిందని చరిత్రను గుర్తు చేశారు. చరిత్ర తెలియని మూర్ఖులు ఎన్టీఆర్ వచ్చాకనే తెలంగాణకు వరి అన్నం తెలిసిందని అంటున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో పాలకుల వివక్ష, మూర్ఖపు పాలన కారణంగా గొలుసుకట్టు చెరువులు దెబ్బతిని తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్నదని.. వ్యవసాయం దెబ్బతిన్నదని చెప్పారు.
తెలంగాణ వచ్చాక వ్యవసాయ రంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందని చెప్పిన మంత్రి.. ఇప్పుడు తెలంగాణ దేశంలోనే వరి పండించే రాష్ట్రంగా ఎదిగిందని చెప్పారు. తెలంగాణ గురించి మాట్లాడేముందు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని మంత్రి హితవుపలికారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Niranjan Reddy, Telangana