హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: ఆ విషయంలో వృద్ధులకు టెన్షన్ అవసరం లేదు.. తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు

Nagar Kurnool: ఆ విషయంలో వృద్ధులకు టెన్షన్ అవసరం లేదు.. తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు

పాలియేటివ్

పాలియేటివ్ కేర్ సెంటర్ ను పరిశీలిస్తున్న శ్వేతా మహంతి

దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, జీవన చరమాంకంలో... అయిన వారి నుండి నిరాదరణకు గురైన వృద్ధులకు "పాలియేటివ్ కేర్ కేంద్రం" (Palliative care) ద్వారా మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి వైద్యులను ఆదేశించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool | Telangana

  Naveen Kumar, News18, Nagarkurnool


  దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, జీవన చరమాంకంలో... అయిన వారి నుండి నిరాదరణకు గురైన వృద్ధులకు "పాలియేటివ్ కేర్ కేంద్రం" (Palliative care) ద్వారా మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి వైద్యులను ఆదేశించారు. నాగర్‌ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కలెక్టర్ పి.ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మను చౌదరిలతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి సందర్శించారు. ఈ సందర్బంగా ముందుగా ఎన్.సి.డి సెంటర్లో రిజిస్టర్‌ను పరిశీలించారు. ఎన్.సి.డి సెంటర్ ద్వారా ఎంత మందికి వైద్య సేవలు, ఉచితంగా మందులు అందిస్తున్నారు అనే విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


  పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని సందర్శించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారిని శ్వేతా మహంతి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాలియేటివ్ కేర్ కేంద్రం వైద్యాధికారి డా. శ్రీవాణి ఈసందర్భంగా అందిస్తున్న సేవల గురించి కమిషనర్‌కు వివరిస్తూ.. గత ఆరు మాసాల నుండి పాలియేటివ్ కేర్ ద్వారా 211 మంది ఔట్ పేషెంట్లు నమోదు కాగా 61 మంది ఇన్ పేషెంట్లుగా వైద్యం పొందినట్లు తెలిపారు. ఇక్కడి కేంద్రంలో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు కమిషనర్‌కు వివరించారు.


  ఇది చదవండి: ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యేదెన్నడు..? పేదలకు దక్కేదెన్నడు..?


  పాలియేటివ్ కేర్ కేంద్రానికి ఫిజియోథెరపిస్ట్‌ను వెంటనే నియమించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. క్యాజువాలిటీలో ఈ.సి.జి యంత్రాన్నీ పరిశీలించిన కమిషనర్ శ్వేతా మహంతి రోజు ఎంత మందికి ఈసీజీ తీస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. అయితే ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగుల నిష్పత్తికి ఈ.సి.జి తీసిన నిష్పత్తికి పొంతన లేదని, చాలా తక్కువ మందికి ఈ సదుపాయం కల్పిస్తూన్నారంటూ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.  హృద్రోగ సంబంధిత వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 60 నుంచి 70 వేల రూపాయల విలువైన మందులను ఉచితంగా అందిస్తుండగా, ఇక్కడి కేంద్రంలో ఇప్పటివరకు ఎంత మందికి ఈ ఉచిత మందులు అందజేశారని అడిగి తెలుసుకున్నారు. విలువైన మందులను రోగులకు అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తపరిచారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శ్వేతా మహంతి వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేయాల్సిన వసతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ డయాగ్నస్టిక్, టీ హబ్ కేంద్రాలకు అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు