Naveen Kumar, News18, Nagarkurnool
నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లోని అమ్రాబాద్ అభయారణ్యానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దాదాపు 2,611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో ప్రకృతి అందాలు వన్యప్రాణులకు నిలయంగా ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, బౌరాపురం, అక్కమహాదేవి గుహలు, ఉమామహేశ్వరం, మద్దిమడుగు లాంటి ఆధ్యాత్మిక ప్రవేశాలతో పాటు శ్రీశైల ప్రాజెక్టు జూరాల వరకునల్లమల అడవికి వడ్డాణంలా ప్రవహించే కృష్ణమ్మ ప్రత్యేక అందంగా నిలుస్తుంది. 1983 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ టైగర్ అభయారణ్యంగా ఉన్న అడవి తెలంగాణ (Telangana) ఏర్పాటుతో అమ్రాబాద్ అభయారణ్యంగా మారింది. నల్లమల అడవి (Nallamala Forest) పెద్దపులులకు ప్రత్యేకంగా నిలుస్తుంది. పెద్ద పులుల రక్షణకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తో కలిసి జాయింట్ రివర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
2018లో కేంద్ర అటవీశాఖ అంచనా మేరకు 17 పులులు ఉన్నట్లు గుర్తించగా 2022లో ఈ సంఖ్య 26 కు చేరాయి. అయితే 30 వరకు పెద్ద పులులు ఉండే అవకాశం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ అటవీ శాఖ పెద్దపులులకు సేఫ్ జోన్ గా మారింది. క్రమేపి పెద్దపులులు సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారి రోహిత్ సఫారీ యాత్రను ఏర్పాటు చేశారు.
గత ఏడాది నుంచి విజయవంతంగా సాగుతూ వస్తుంది. దీంతో హైదరాబాద్ నుంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న వాహనాలకు తోడుగా కొత్తగా ఎనిమిది సఫారీ వాహనాలను సమకూర్చారు. అదే విధంగా పర్యాటకుల కోసం ఆరు కొత్త కాటేజీలను సైతం ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల పర్యాటకులు రాత్రివేళ ఈ కాలేజీల్లో బస చేసి ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు. ఈ సఫారీ టూర్ కోసం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా అటవీ ప్రాంతంలో వివరాలను ప్రజలందరికీ తెలియజేసేలా ఏటిఆర్ పేరిట ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. ఈ అభయారన్యంలో ఉన్న పెద్ద పులులు, చిరుతపులులు, కణతి, మన్నువోతు, అడవిపందులు, దుప్పిలు, చుక్కల దుప్పిలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, జింకలు, నక్కలు ఆంబోతులతో పాటు 200 రకాల పక్షులు, క్షీరదాలు 100 రకాలు, సీతాకోకచిలుకలు 50 రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి పెద్ద పులులు, చిరుతపులులు, తదితర వన్య ప్రాణులవివరాలు, చెట్లు, పక్షులు వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. దీనివల్ల అడవి ప్రాముఖ్యత విశేషాలు ప్రజలకు క్షణాల్లోనే తెలుస్తాయి. ఈ వెబ్సైట్ తో పాటు పుస్తకాలను ముదిరించి వెబ్సైట్ తో పాటు అందించనున్నారు. సఫారీ వాహనాలు కాటేజీలను మంత్రి అల్లోల్లఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సఫారీ యాత్రలో రోజుకు 12 మందిని ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఒక్కొక్కరికి రూ.2300 వరకు చెల్లించాలి. ఇందులో రూ.300 ట్రెక్కింగ్, రూ.1000 జంగిల్ సఫారీ చార్జి కాగా ట్రిప్ ముగిసే వరకు 24 గంటలకు బెడ్ రూమ్ చార్జీ మరో రూ.1000తో కలిసి మొత్తం రూ.2300 అవుతుంది. ఇద్దరు అయితే రూ.4600గా చార్జీలు నిర్ణయించారు. నలుగురు వ్యక్తులైతే రూ.7000గా నిర్ణయించారు. జంగిల్ సఫారీ చార్జీ 24 గంటలకు, డబుల్ బెడ్ రూమ్ చార్జీలు రూ.4000 చొప్పున చార్జీ నిర్ణయించారు. ఆరుగురికి అయితే రూ.8500 నిర్ణయించారు. రూ.1500 ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఛార్జి రూ.2000 , జంగిల్ సఫారీ చార్జీ, 24 గంటల ట్రిపుల్ బెడ్ రూమ్ కు రూ.6000 చొప్పున మొత్తం రూ.9500గా నిర్ణయించారు. పెరిగిన ధర నేపథ్యంలో ప్రస్తుతం ఈ ధరలు ఉన్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana, Tigers