హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆ ప్రాజెక్టు నిర్వాసితులకు టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. రూ.40కోట్లు మంజూరు

ఆ ప్రాజెక్టు నిర్వాసితులకు టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. రూ.40కోట్లు మంజూరు

డిండి రిజర్వాయర్ నిర్వాసితులకు నిధుల విడుదల

డిండి రిజర్వాయర్ నిర్వాసితులకు నిధుల విడుదల

డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ముంపు బాధిత కుటుంబాలకుపునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ ఉదయ్ కుమార్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అమలు ప్రక్రియను ప్రారంభించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ముంపు బాధిత కుటుంబాలకుపునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ ఉదయ్ కుమార్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అమలు ప్రక్రియను ప్రారంభించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన కేశ్యతాండ, మార్లతాండ పెద్దలతో ప్రాజెక్టు లెవల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివరిస్తూ.. రెండు తాండాల కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం నిబంధనల మేరకు 347 కుటుంబాలుగా గుర్తించి వీరికి అవసరమైన మౌళిక సదుపాయాలతో కూడిన పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ఇల్లు కట్టుకోడానికి ఒక్కో కుటుంబానికి రూ. 5.00 లక్షలు, ఏజెన్సీ ఏరియాలో ఉన్నందున మరో 50 వేలు, తరలింపు ప్రక్రియకు అదనంగా 50 వేలు, తనదైన ప్రాముఖ్యం కింద ఒక్కో కుటుంబానికి నెలకు 3 వేల రూపాయల చొప్పున 12 నెలలకు రూ. 36 వేలు ,దీనికి తోడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో 1.25 లక్షలు వెరసి ఒక్కో కుటుంబానికి రూ.7.61 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, తాగు నీరు, స్కూల్ బిల్డింగ్, దేవాలయం,తదితర మౌళిక వసతుల కల్పనకురూ.40 కోట్లు మంజూరు అయ్యాయని పునరావాస కమిటి సభ్యులకు వివరించారు.

ఇది చదవండి: కేసీఆర్ ఇచ్చిన హామీకే దిక్కులేదు.. బిక్కుబిక్కు మంటున్న జనం.. కారణం ఇదే.!

వీటిపై పునరావాస కమిటీ సభ్యుడు, సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కల్పిస్తున్న పునరావాస కేంద్రం రిజర్వాయర్ కు కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉందని అధికంగా నీరు వస్తే తిరిగి ముంపుకు గురి అయ్యే ప్రమాదం ఉందని అక్కడ కాకుండా వేరే మరెక్కడైన స్థలం కేటాయించి పునరావాసం కల్పించాలని కలెక్టర్ ను కోరారు. ఒక్కొ కుటుంబానికి 150 గజాల స్థలానికి బదులు 250 గజాల స్థలం కేటాయించాలన్నారు.అదేవిధంగా రేటు విషయంలో మరోసారి ఆలోచించి రేటు పెంచాలని అభ్యర్థించారు.భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వ్యవసాయంపై ఆధారపడినరైతులు భూమి లేకపోవడంతో ఆధారం కోల్పోయారని చెప్పారు. తిరిగి భూములు కొనలేని పరిస్థితి ఉన్నందున భూ పరిహారం విషయంలో మరో మారు ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన కలెక్టర్ స్థలం విషయంలో ఆర్డీఓ, ఇరిగేషన్ అధికారులు మరోమారు పరిశీలించి బాధితుల అభ్యంతరాలను పరిగాణనలోకి తీసుకొని, వాస్తవిక పరిస్థితి పరిశీలించి నివేధికను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా రేటు విషయంలో నిబంధనల మేరకే ఇవ్వడం జరిగిందని ఒకవేళ కోర్టు నుండి ఆదేశాలు వస్తే అమలు చేస్తామని హామీనిచ్చారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు