N.Naveen Kumar, News18, Nagarkurnool
వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచేందుకు రైతులు అధిక దిగుబడిలను సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు మేళాలను ఏర్పాటు చేస్తుంది. ఈ రైతుమేళా ద్వారా రైతులకు నూతన పద్ధతులను దిగుబడును అధికంగా సాధించే పద్ధతులను వివరిస్తున్నారు. స్టాలన్ ఏర్పాటు చేసి అధు నూతన పరికరాలను వినియోగించి ఏ విధంగా వ్యవసాయాన్ని చేయాలో, నూతన వంగడాలతో ఎలా ఎలా వ్యవసాయం చేయాలో వివరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలెం వ్యవసాయ యూనివర్సిటీలో ఈ రైతు మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతులకు పంటలకు అవసరమైనటువంటి పరికరాలను ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు వాటి ఉపయోగలను వివరించారు. ఇందులో భాగంగానే పాలెం వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అగ్రి సోలార్ యూనిట్ ను కనిపెట్టడం జరిగింది. పంటకు రక్షణ కల్పించేందుకు ఈ సోలార్ మెషిన్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్త అరుణకుమారి చెప్పారు. పంటను ఎదిగిన సమయంలో అడవి పందుల నుంచి, కోతుల నుంచి, ఇతర జంతువుల నుంచి, రక్షించుకునేందుకు ఫెన్సింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెన్సింగ్ ద్వారా కోతులను, అడవిపందుల నుంచి కానీ పంట చేలను నాశనం చేయకుండా కాపాడవచ్చని వివరించారు.
ఈ సోలార్ మిషన్ ద్వారా 5 ఎకరాలకు గాను రూ. 21వేల వరకు ఖర్చు వస్తుందని, పంట చుట్టూ ఒక జే వైర్ ఫెన్సింగ్ వస్తుందని వివరించారు. కరెంటు సప్లై ను ఏర్పాటు చేసి అడవి పందులు కానీ కోతులు కానీ అటువైపుగా వెళ్లితే వైర్లను తగిలిన వెంటనే షాక్ కు గురై అక్కడ నుంచి జంతువులు వెళ్లిపోతాయని చెప్తున్నారు. అయితే అటవీ జంతువులకు ఏమాత్రం ప్రాణహాని కలవకుండా వీటిని తయారు చేశామని చెప్పారు. కేవలం చిన్నపాటి షాక్ మాత్రమే తగులుతుందని, ప్రాణాపాయం వంటి అపాయం ఏమాత్రం ఉండదని వివరించారు. రైతులు ఎవరైనా కావాలనుకుంటే పాలెం అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీ అధికారులను సంప్రదిస్తే వారి ఆధ్వర్యంలో రైతులకు ఈ అగ్ని సోలార్ మిషన్ ను అందించడం జరుగుతుందని చెప్పారు.
రైతుల నుంచి ఎక్కువ మొత్తంలో బుకింగ్స్ రావడం జరిగితే ధర విషయంలో చాలా వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే పంటను కాపాడుకునేందుకు రైతులు చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పంట చుట్టూ చీరలు కట్టడం, అదేవిధంగా కరెంట్ షాక్ లు పెట్టడం వంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ కరెంట్ షాక్ వలన అడవి జంతువులతో పాటు చాలాసార్లు మనుషుల ప్రాణాలు కూడా బలి తీసుకోవడం జరిగింది.ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి పాలెం వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు అగ్రి సోలార్ మిషన్ ఏర్పాటు చేశారు.
బైట్; అరుణ శాస్త్రవేత్తల, పాలెం వ్యవసాయ కళాశాల
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana