హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: జెడ్పీ చైర్మన్ ఎంపికలో ట్విస్ట్.. అసలు ఏం జరిగింది అంటే..?

Nagar Kurnool: జెడ్పీ చైర్మన్ ఎంపికలో ట్విస్ట్.. అసలు ఏం జరిగింది అంటే..?

జడ్పీ చైర్మన్ ఎంపికలో ట్విస్ట్

జడ్పీ చైర్మన్ ఎంపికలో ట్విస్ట్

నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 22న జెడ్పీ సమావేశం తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎంపిక విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఏం జరిగింది అంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

N.Naveen Kumar,News18,Nagarkurnool

నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) పరిషత్ చైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ (Elecations Commission) షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 22న ప్రత్యేక సమావేశం నిర్వహించి జడ్పీ చైర్పర్సన్ (ZP Chirperson) ఎన్నుకునేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముగ్గురు సంతానం కింద కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జడ్పీ చైర్మన్ (ZP Chirman) పద్మావతి చేసుకున్న అప్పీల్ ను హైకోర్టు (Higcourt) కొట్టివేసిన నేపథ్యంలో ఆమె ఎన్నికల రద్దయింది. దాంతో తెలకపల్లి జడ్పిటిసిగా ఆమె తర్వాత ఓట్లు పోలైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్సీ జనరల్ కు రిజర్వ్ చేయబడినటువంటి జడ్పీ చైర్పర్సన్ స్థానంలో పూర్తి బలమున్న టిఆర్ఎస్ నుంచి చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశాలు ఇద్దరికీ ఉన్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి జడ్పిటిసిగా గెలుపొందిన ఎంపీ పోతుగంటి రాములు తనయుడు భరత్ ప్రసాద్ ఉండగా.. ఊరుకొండల మండలం నుంచి గెలుపొందినటువంటి శాంత కుమారికి ఈ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.

ఎంపీ తనయుడు భరత్ పై సానుకూల వాతావరణం ఏర్పడడానికి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ఎంపీ రాములు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా కలిసి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ , కేటీఆర్ కు కూడా తన వాదనను వినిపించినట్టు తెలుస్తోంది.

అన్నీ సజావుగా సాగితే ఈనెల 22న జరిగే జడ్పీ ప్రత్యేక సమావేశంలో చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ అధిష్టానం మరింత కాలం పాటు ఇన్చార్జిగా ఉన్న బాలాజీ సింగ్ ఠాకూర్ ను కొనసాగించాలి అనుకుంటే ఈనెల 22న జరిగే సమావేశంలో జడ్పిటీసీల కోరం లేకుండా చేసి కాలయాపన చేయవచ్చు. అయితే తన ఎన్నిక విషయంలో పద్మావతి సుప్రీంకోర్టుకు అప్లై చేసుకున్న నేపథ్యంలో జడ్పీ చైర్మన్ ఎన్నిక మరింత కొంతకాలం ఆపుతారా లేక నియమిస్తారా అన్న విషయాలు తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రీ పై కృత్తికా దీప మహోత్సవం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఎట్టి పరిస్థితుల్లోఎంపీ రాములు తన తనయుడు భరత్ ను జడ్పీ చైర్మన్ గా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు తమవాదనను వినిపించి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చేయమని మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి కోరుతున్నట్టుగా తెలుస్తోంది.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు