హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: సూర్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

Nagar Kurnool: సూర్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

స్వామివారి బ్రహ్మోత్సవాలు

స్వామివారి బ్రహ్మోత్సవాలు

Telangana: సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అరసవిల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ స్వామి ఎంతో ప్రసిద్ధిగాంచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అరసవిల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ స్వామి ఎంతో ప్రసిద్ధిగాంచింది. అలాంటి ఆలయం చాలా అరుదుగా ఉంటాయి. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం బలానపల్లి గ్రామంలో సూర్యనారాయణ స్వామి ఆలయం వెలిసింది.

ఈ ఆలయంలో సూర్య భగవానున్ని దర్శించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి చేరుకొని ముక్కులు చెల్లించుకుంటున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ఏకైక సూరన్నారాయణ స్వామి దేవాలయంగా గుర్తింపు పొందిన బలంపల్లిగ్రామంలోని ఆలయంలో ఈనెల 27 నుంచి 29 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఇందుకు తగినటువంటి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు.

క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో చాళుక్యుల రాజులు నిర్మించిన ఈ సూర్య భగవానుని ఆలయం ముస్లిం రాజుల పరిపాలనలో ధ్వంసమై శిథిలావస్థకు చేరింది. 2020లో గ్రామ సభ్యులందరూ కలిసి ఆలయాన్ని పునరుద్ధరించారు. రెండేళ్లుగా దాతలు సహకారంతో ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు సైతం చేపట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో బలంపల్లి గ్రామంలో మాత్రమే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అరుదుగా ఉండే సూర్యగ్రహవానుడి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఈనెల 27 శుక్రవారం సూర్యనారాయణ స్వామి ఉత్సాహ విగ్రహం ఊరేగింపు స్వామివారికి అభిషేకం సూర్యఆదిత్య పారాయణం, మలయాళ స్వామితో విశ్వశాంతి మహా యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. 28న శనివారం స్వామివారి ఆదిత్య పారాయణంతోపాటు భగవద్గీత పఠనం స్వామివారికి అభిషేకం ఉంటుంది.

అదేవిధంగా ఉషాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం నిర్వహించనున్నారు. 29న స్వామివారికి అభిషేకం ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామికి సామూహిక వ్రతాలు ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కూచుకున్న దామోదర్ రెడ్డి కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు