Naveen Kumar, News18, Nagarkurnool
రైతులకు వర్షాభావ పరిస్థితులు తీరని నష్టాలు గురిచేస్తున్నాయి. వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తట్టుకోవడానికి రైతన్నలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. పప్పు దినుసులు, నూనె గింజలు, వాణిజ్య ఉద్యానవన పంటలతో పాటు కలప పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. కలప సాగులో ప్రధానంగా సుబాబుల్ పంటలు ఆశాజనకంగా ఉంటున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో జోగులంబా గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) లో అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు, వడ్డేపల్లి, రాజోలి, ఐజ మండలాల్లో సుబాబుల్ సాగుపై రైతు రైతులు మక్కువ కనబరుస్తున్నారు. ప్రతికూల వాతావరణంలోని దీని సాగు సులభతరం కావడంతో అనేకమంది సుబాబుల్ పెంచడంతోపాటు కొంత ఉరట చెందుతున్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో సుమారు 6 నుంచి 7 వేల ఎకరాల్లో ఈ సుబాబులు తోటల సాగును రైతులు చేపట్టారు. త్వరగా పెరిగే బహు వార్షిక మొక్క, వంట చెరుకు, పశుగ్రాసం, పనిముట్లకు, కలప, కాగితపు గుజ్జు లాంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. వీటి విత్తనాల్లో 24% మాంసకృతులు కలిగి ఉంటాయి అందుకే సులభంగా మొలకెత్తుతాయి.వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో సుబాబులు సాగు లాభసాటిగా ఉంటుంది. ఉష్ణ మండలాల్లో బాగా ఈ పంటలు పెరుగుతాయి. వర్షపాతం 600 నుంచి 1700 మిల్లీమీటర్ల ఉన్న ప్రాంతాల్లో సాగుకు అణువుగా ఉంటుంది. క్షార, ఆమ్ల నేలల్లో తప్ప అన్ని రకాల కటస్థ నేలల్లో పెంచడానికి అనువైనది. లోతైన సారవంతమైన బంజరు భూముల్లో, చెరువుగట్లు, కాలువ గట్లు, పొలాల గట్ల పైన పంటల్లో పెంచవచ్చు. మెట్ట పొలాల్లో జై కే-8, కె-28 నీటి వసతి ఉన్న హవాయిడ్ కె-638 రకాలను సాగు చేయడానికి అనువుగా ఉంటుంది.
జూలైలో సుబాబులసాగు అనువుగా ఉంటుంది. దీంతో నారుమళ్లలో లేదా పాలిథిన్ సంచుల్లో మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో విత్తనాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఒక కిలో కు 16 నుంచి 20వేల విత్తనాల వరకు వస్తాయి.విత్తన శుద్ధిలో భాగంగా సుమారు 30 సెల్సియస్ వేడినీటిలో ఐదు నిమిషాలు ఉంచి ఆ తరువాత తీసి విత్తనాలను చల్లని నీటిలో 12 గంటలు నానబెట్టుకొని విత్తుకోవాలి. నారుమడిలో నేరుగా విత్తడానికి వరుస మధ్యలో 20 సెంటీమీటర్లు, వరసలో 4సెంటీమీటర్లు దూరం 15 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను విత్తుకోవచ్చు. లేదా 22*10 సెంటీమీటర్లు పాలిథిన్ సంచుల్లో పేడ ఎరువులను కలిపి మట్టిని నింపి ఒక సంచిలో రెండు విత్తనాలు చొప్పున వితుక్కోవాలి. వేసవిలో 30*30 పరిమాణంలో 45 సెంటీమీటర్ల లోతు గుంతలను తవ్వితే నేల గుల్లబారి మొక్క నాటడానికి అనువుగా ఉంటుంది.
వర్షాకాల ప్రారంభంలోనే మట్టిని నింపిన గుంతలు సంచుల్లోనూ మొక్కలను నాటాలి. మొక్కలమధ్య దూరం 2*2 లేదా 2 * 3 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. ఎకరానికి 600 నుంచి 1000 మొక్కల వరకు నాటుకోవచ్చు. మొక్కల మధ్య మొదటి సంవత్సరం అంతర సాగు చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల వరకు కలుపు నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సుభాబుల్ అవసరాన్ని బట్టి వీటిని వినియోగించుకోవలసి ఉంటుంది. పశుగ్రాసానికి అయితే రెండు నుంచి మూడు నెలలు 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు వరకు,వంటచేరుకు కోసం రెండు నుంచి మూడు ఏళ్ల మధ్య ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాగితపు గుజ్జు కోసం నాలుగు నుంచి ఐదు ఏళ్లమధ్య ఉపయోగించుకోవచ్చు. చెట్ల పక్కకొమ్మలు ఎప్పటికప్పుడు నరికి పెరిగేటట్లు చేస్తే 10 నుంచి 15 ఏళ్ల వరకు కలపకు ఉత్పత్తి అవుతుంది. సుబాబుల్ 6 ఏళ్లలో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో కలప దిగుబడి 4 ఘనపు మీటర్ల వరకు వస్తుంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంటుంది.
వర్షపాతం వర్షాధార ప్రాంతాల్లో పశుగ్రాసం 5 నుంచి 10 టన్నులు కాగా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 32 నుంచి 36 టన్నుల దిగుబడి వస్తుంది. కలప గట్టిగా ఉండడంతో పాటు నాణ్యతగా ఉంటుంది. భవన నిర్మాణం సామాగ్రి, ఫర్నిచర్ తయారీ, గుంజలు, కంచె స్తంభాలు, కొమ్మలు, వంటచెరుకు, ఆకులు పశుగ్రాసం ఉపయోగపడతాయి. మొక్కలను ఎనిమిది మీటర్లు ఎడంగా రెండు ఉమ్మడి వరుసల్లో వాటిని 30 సెంటీమీటర్లు కోస్తే ఎకరాకు 0.8 టన్నుల వరకు ఆరాటన్ను వరకు వంటచెరుకు లభిస్తుంది. కాగితం తయారీకి శ్రేష్టమైన గుజ్జు లభిస్తుంది.
అయితే పశుగ్రాసానికి రెండేళ్ల వరకు మేకలు, పశువుల నుంచి కాపాడుకోవాలి. లేత ఆకుల్లో మైమోసిన్అనేది అధికంగా ఉన్నందున సుభాబులను ఇతర పశుగ్రాసాలతో కలిపి మేపుకోవాల్సి ఉంటుంది. అలాగే చెట్లకు సహజ పునరుత్పత్తి ఎక్కువగా ఉండడంతో కలుపు మొక్కలు పడతాయి. వీటిని నివారించుకోవడానికి అంతర్ సేద్యం చేయాలి. సుభాలతో పాటు జొన్న, ఆముదం, కంది వంటి పంటలను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jogulamba gadwal, Local News, Nagarkurnool, Telangana