రిపోర్టర్ : నవీన్ నాగిళ్ల
లొకేషన్ : నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లాలో అఖిలపక్ష నేతలు చేపట్టిన బంద్ సంపూర్ణమైంది. వ్యాపార సంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేపట్టి విజయవంతం చేశారు. మన్ననూరు గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని నిఖిత మరణంపై గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. నిఖితది ఆత్మహత్య కాదని హత్యాని ఆరోపిస్తూ పలు ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపడుతూ వస్తున్నారు. పాఠశాలలో జరిగిన కొన్ని సంఘటన కారణంగానే నిఖిత హత్య చేయబడిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరణ చేసి కేసులు తప్పుదోవ పట్టించారని ధర్నాలు చేపడుతూ వస్తున్నారు.
దీంతో స్పందించిన ప్రభుత్వం నిఖిత మృతదేహానికి మళ్లీ రీ పోస్టుమార్టం చేయించారు. అయితే ఇప్పటివరకు పోస్టుమార్టం వివరాలు వెల్లడించడకపోవడం, నిందితులను అదుపులోకి తీసుకోకపోవడంతో అఖిలపక్ష నేతలు ఆగ్రహించారు. ఒక దళిత బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన చేపడుతున్నారు. కులాన్ని గుర్తించే న్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు నిరసనగా నిఖిత కేసులో నిందితులను పట్టుకొని శిక్షించే వరకు తాము నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగానే నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టారు. ఆర్టిసి బస్సులు విద్యాసంస్థలను మాత్రమే పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మినహాయింపులు ఇచ్చారు. మిగతా అన్ని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బందులో పాల్గొని నిఖితా మృతికి నివాళులు అర్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool