హోమ్ /వార్తలు /తెలంగాణ /

గోడలో బంధీగా గాంధీ.., మహాత్ముడికి ఇచ్చే గౌరవం ఇదేనా..?

గోడలో బంధీగా గాంధీ.., మహాత్ముడికి ఇచ్చే గౌరవం ఇదేనా..?

నాగర్

నాగర్ కర్నలులో గోడలో బంధీగా గాంధీ విగ్రహం

గాంధీ జయంతి (Gandhi Jayanthi) సమీపిస్తుంది. దేశ విదేశాల్లో ఏర్పాటు చేసిన అన్ని గాంధీ విగ్రహాల దగ్గర మహాత్ముడికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు ప్రజలు. భారత దేశ స్వాతంత్య్రం కోసం మహాత్ముడి పోరాటం, కృషిని తలుచుకొని కొనియాడుతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

    Naveen Kumar, News18, Nagarkurnool

    గాంధీ జయంతి (Gandhi Jayanthi) సమీపిస్తుంది. దేశ విదేశాల్లో ఏర్పాటు చేసిన అన్ని గాంధీ విగ్రహాల దగ్గర మహాత్ముడికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు ప్రజలు. భారత దేశ స్వాతంత్య్రం కోసం మహాత్ముడి పోరాటం, కృషిని తలుచుకొని కొనియాడుతారు. విగ్రహాల వద్ద అలంకరణ చేసి ఘనంగా కార్యక్రమాలు చేపడతారు. దేశ విదేశాల్లో గాంధీ విగ్రహాలకు ఇంతటి గౌరవం కల్పిస్తుండగా.. నాగర్‌కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లోని ఓ గాంధీ విగ్రహం మాత్రం నిర్లక్ష్యానికి గురవుతుంది. గత 10 ఏళ్లుగా ఆ విగ్రహం నిరాదరణకు నోచుకుంటుంది. గ్రామం నడిబొడ్డున ఉన్నప్పటికీ దయనీయమైన పరిస్థితిలో గాంధీ విగ్రహం ఉంది. ఎందుకని ఆరా తీయగా ఆ గాంధీ విగ్రహం ఒక ప్రహరీ గోడలో బందీ అయింది.

    నాగర్‌కర్నూల్ జిల్లా తుడుకుర్తి గ్రామంలో 40 ఏళ్ల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ నర్సోజి అనే వ్యక్తి గ్రామస్తుల సహకారంతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. బూత్‌పూర్ మండలం కొత్త మొలగర గ్రామం నుంచి వలస వచ్చిన నర్సోజి...చాలాకాలం పాటు తుడుకుర్తి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు. వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో గాంధీ మహాత్ముడిపై అభిమానంతో అక్కడి గ్రామస్తుల సహకారంతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు నర్సోజి. అప్పటి నుంచి ప్రతి ఏటా గాంధీ జయంతి నాడు ఆ గ్రామస్తులంతా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వచ్చేవారు.

    ఇది చదవండి: ఏజెన్సీ ఏరియాలో కూచిపూడి నృత్యానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఈ మాస్టారు

    కాగా, 10 ఏళ్ల క్రితం ఓ దేవాలయ ప్రహరీ గోడ నిర్మాణం నిమిత్తం జరిగిన నాటకీయ పరిణామాలు ఆ గాంధీ విగ్రహాన్ని గోడలో బందీగా చేశారు. దేవాలయ భూమిలో గాంధీ విగ్రహం ఉందని అక్కడి వరకు ప్రహరీ గోడ నిర్మించగా, ఆ గోడ సరిగ్గా గాంధీ విగ్రహం మీదుగానే వెళ్ళింది. విగ్రహాన్ని కనీసం పక్కకు జరపకుండా గాంధీ విగ్రహం గుండా ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు. దీంతో ఆ విగ్రహం ఆనాటి నుంచి ప్రహరి గోడలో బందీ అయింది.

    ఇది చదవండి: రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు.., ఎందుకో తెలుసా..?

    అప్పటి నుంచి ఈ గాంధీ విగ్రహానికి ఎలాంటి నివాళులు అర్పించడం లేదు. ఈ విగ్రహాన్ని గోడలో బందీగా ఉండడాన్ని చూసిన గాంధీ అభిమానులు పలుమార్లు ప్రభుత్వ అధికారులకు నివేదనలు అందించారు. విగ్రహాన్ని తొలగించాలని గాంధీ గౌరవాన్ని కాపాడాలని కోరారు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో గాంధీ విగ్రహం ఇప్పటికీ గోడలోనే బందీగా ఉంది.

    శిథిలావస్థకు చేరిన ఈ విగ్రహాన్ని చూడలేక స్థానికంగా ఉండే ఆర్యవైశ్య సంఘం నాయకులు గ్రామ బస్టాండ్ వద్ద కొత్తగా మరో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగర్‌కర్నూల్, తూడుకుర్తి గ్రామాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు చందాలు వేసుకొని 2013లో రూ. 2 లక్షల రూపాయలతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది నివాళులు అర్పిస్తున్నారు. గోడలో బందీగా ఉన్న గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆయన విగ్రహానికి సముచిత గౌరవం కల్పించాలని తూడుకుర్తి గ్రామస్తులు కోరుతున్నారు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Local News, Mahatma Gandhi, Nagar kurnool, Telangana

    ఉత్తమ కథలు