Home /News /telangana /

NAGAR KURNOOL STATE OF THE ART TECHNOLOGY FOR AFFORESTATION SEED BALLS DROPPED BY DRONES ABH BRV NNK

Nagarkurnool: అడవుల విస్తీర్ణానికి అత్యాధునిక సాంకేతికత: డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్ డ్రాప్

నల్లమల

నల్లమల అటవీ రేంజ్ పరిధిలో సీడ్ బాల్స్ వెదజల్లుతున్న డ్రోన్స్

డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లడం: హారాబహారా ప్రాజెక్ట్ చేపట్టిన మారుత్ డ్సోన్స్ కంపెనీ అమరబాద్ అడవుల్లో వెదజల్లిన లక్ష విత్తన బంతులు చింత, మర్రి, వెదురు, కానుగ, వంటి విత్తనాలు 2030 నాటికి 1బిలియన్ మొక్కలు నాటడమే లక్ష్యం

    (N.Naveen Kumar, News 18, NagarKurnool)

    డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లడం:
    హారాబహారా ప్రాజెక్ట్ చేపట్టిన మారుత్ డ్సోన్స్ కంపెనీ
    అమరబాద్ అడవుల్లో వెదజల్లిన లక్ష విత్తన బంతులు
    చింత, మర్రి, వెదురు, కానుగ, వంటి విత్తనాలు
    2030 నాటికి 1బిలియన్ మొక్కలు నాటడమే లక్ష్యం

    విత్తన బంతులను వెదజల్లడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తు దట్టమైన అడవుల్లో మనుషులు వెళ్లలేని ప్రదేశాలలో సైతం మొక్కలు పెరిగేలా డ్రోన్ల సహాయంతో విత్తన బంతులను వెదజల్లుతున్నారు. హారబహారా ప్రాజెక్ట్ ద్వారా మారుత్ డ్రోన్స్ కంపెనీ నాగర్‌కర్నూల్ జిల్లా అమరబాద్ అడవుల్లో లక్ష విత్తన బంతులను వెదజల్లారు.

    అడవులను పెంచేందుకు విత్తన బంతులు:
    అటవీ ప్రాంతంలో మొక్కలను పెంచేందుకు ఈ విత్తన బంతులను వినియోగిస్తారు. రకరకాల మొక్కలకు చెందిన విత్తనాలను మట్టి, యూరియా వంటి మిశ్రమాలతో కలిపి బంతులుగా తయారు చేస్తారు. ఒక్కో బంతిలో 50 నుంచి 70 వరకు విత్తనాలు ఉండేలా తయారు చేస్తారు. వీటిని అటవీ ప్రాంతంలో, ఎత్తైన గుట్టల ప్రాంతంలో వెదజల్లుతారు. గుట్టలపై విత్తన బంతులను విసిరివేయడం ద్వారా వర్షాకాలంలో ఈ విత్తనాలు తేలికగా మొలకెత్తుతాయి. ఈ పద్దతి ద్వారా అడవుల పెంపకానికి ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం మొదలు పెట్టిన నాటి నుంచి ఈ సీడ్ బాల్స్ విధానాలను అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్దతికి సాంకేతికతను వినియోగించుకొని డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్‌ను వెదజల్లేందుకు మారుత్ డ్రోన్స్ సంస్థ ముందుకు వచ్చింది.

    అమరాబాద్ అడవుల్లో డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్:
    నాగర్‌కర్నూల్ జిల్లా అమరబాద్ మండలంలోని అటవీ రేంజ్ పరిధిలో డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్‌ను వెదజల్లుతున్నారు. మారుత్ డ్రోన్స్ కంపెనీ హారాబహారా ప్రాజెక్ట్ చేపట్టి దట్టమైన అటవీ ప్రాంతంలో మనుషులు వెళ్లలేని ప్రదేశాల్లో సీడ్ బాల్స్‌ను వెదజల్లుతున్నారు. డ్రోన్ లోని ఒక ప్రత్యేకమైన బాక్స్‌లో సీడ్ బాల్స్ నింపి, సిస్టమ్ ఆపరేటింగ్ ద్వారా కావల్సిన ప్రదేశాల్లో ఈ బాల్స్‌ను జారవిడుస్తారు. దేశంలో మొదటిసారిగా మారుత్ డ్రోన్స్ కంపెనీ ఈ సీడ్ బాల్స్ ప్రాజెక్ట్ చేపట్టి తెలంగాణలోని పలు జిల్లాలలో అటవీ ప్రాంతంలో మొక్కల పెంపకానికి దోహదం చేస్తున్నారు.

    లక్ష సీడ్ బాల్స్‌ను వెదజల్లిన డ్రోన్స్:
    హరితహారం కార్యక్రమంతో సంయుక్తంగా హారాబహారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమరబాద్ అడవుల్లో మారుత్ డ్రోన్స్ కంపెనీ వారు ఇప్పటి వరక లక్ష సీడ్ బాల్స్‌ను వెదజల్లారు. వీటిలో చింత, రావి, వెదురు, జువ్వి, నెమలినార, కానుగ, మర్రి వంటి విత్తనాలను మట్టి  బంతుల రూపంలో చేసి వెదజల్లారు. అమరాబాద్ అడవుల్లో ఈ రకం మొక్కలు ఎక్కువగా పెరుగుతాయని, ప్రత్యేకంగా ఆయా రకాల మొక్కలను ఎంచుకున్నట్లు సంస్థ ప్రతినిధి వివరించారు. మొత్తం 320 ఎకరాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో లోయల్లో, ఎత్తైన గుట్టలపైన విత్తనాలను చల్లారు.

    2030 వరకు 1 బిలియన్ మొక్కలపెంపకమే లక్ష్యం:
    మారుత్ డ్రోన్ కంపెనీ 2021 ఏడాదిలో హారాబహారా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనట్టు టీం లీడర్ శ్రావణ్ తెలిపారు. గతేడాది సినీ నటుడు రానాతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 50 లక్షల సీడ్ బాల్స్ 12000 హెక్టార్లలో వెదజల్లారు. ఈ ప్రక్రియ వలన 60 శాతం మొక్కలు మొలకెత్తడం జరిగిందని 30 శాతం అటవీ ప్రాంతం పెరిగిందని అటవీశాఖ వారు నివేదిక ఇచ్చినట్లు శ్రవణ్ వివరించారు. 2030వరకు 1 బిలియన్ మొక్కలను నాటడమే లక్ష్యంగా ఈ హారాబహారా ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్తున్నట్లు మారుత్ డ్రోన్స్ కంపెనీ నిర్వహకులు వివరించారు. ఈ ఏడాది కామారెడ్డి, ఆదిలాబాద్, సంగారెడ్డి, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాలో చేపట్టారు. మారుత్ డ్రోన్స్ టీం లీడర్ ఫోన్ నెంబర్: 7780589399
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Nagar kurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు