Naveen Kumar, News18, Nagarkurnool
భూములు, ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు, క్రయవిక్రయాలు జరగాలంటే ముందుగా బాండ్ పేపర్ కొనాలి. అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మరోసారి చివరికి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఈ బాండ్ పేపర్ కావాలి. ఇలా భూములు క్రయవిక్రాయాలతో పాటు డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడు కూడా బాండ్ పేపర్ మీద రాసుకొని సంతకాలు పెట్టించుకొని ఇస్తారు. అప్పుడే ఇరువురి నమ్మకం ఉంటుంది. అయితే వ్యాపారులు బాండ్ పేపర్ల కృత్రిమ కొరత సృష్టిస్తూ అక్రమ దందా సాగిస్తున్నారు. 50 రూపాయల బాండ్ పేపర్లు 100 రూపాయల గాను, 100 రూపాయల బాండ్ పేపర్లు కా 200లకు విక్రయిస్తూ దోపిడి చేస్తున్నారు. ఈ పేపర్ లపై ఇదివరకు 20 రూపాయలు అదనంగాతీసుకునేవారు.ఇప్పుడు డబుల్ చార్జి వసూలు చేస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahboobnagar District) లో 200 పైగా స్టాంప్ వెండర్ల పేపర్లను విక్రయిస్తున్నారు. ప్రభుత్వానికివీరంతా ఫీజు చెల్లించి అనుమతులు తీసుకొని రిజిస్ట్రేషన్ శాఖ నుంచి బాండ్ పేపర్లు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. చాలామంది వినియోగదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లకుండా నేరుగా వీరి వద్దకే వెళ్లి బాండ్ పేపర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీరికిడిమాండ్ బాగా పెరిగిపోయింది.ఈ డిమాండ్ ను బట్టి బాండ్ పేపర్లో దొరకడం లేదని డబుల్ రేటుకు విక్రయిస్తున్నారు.
పాత తేదీలలో బాండ్ పేపర్లు కావాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది స్టాంప్ వెండర్ల వద్ద వద్ద పాత తేదీలకు సంబంధించిన బాండ్ పేపర్లు రెడీగా ఉంటాయి. జనాల అవసరాన్ని బట్టి అధిక ధరలకు దీనిని విక్రయిస్తూ ఉంటారు. వీటిపై పర్యవేక్షణ లేని కారణంగానే విచ్చలవిడిగా ధరలు పెంచుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ స్టాంప్ వెండర్ సెంటర్లో దుకాణాల్లో అప్పుడప్పుడు తనిఖీలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బాండ్ పేపర్లు దొరుకుతాయని విషయం చాలామందికి తెలియదు. బాండ్ పేపర్లు ఫోన్ లో టి యాప్ లో డౌన్ లోడ్ చేసుకొని ఆన్ లైన్ ద్వారా వంద రూపాయలు చెల్లించి తర్వాత కార్యాలయాన్ని సంప్రదిస్తే వివరాలు తీసుకొని బాండ్ పేపర్లో అందిస్తారు. అయితే ఈ సమాచారం చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ స్టాంప్ వెండర్ల దుకాణాలపై ఆధారపడుతున్నారు. వీటిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు అందిన గాడికి దోచుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana