Home /News /telangana /

NAGAR KURNOOL SOMASILA SIDDESHWARAM BRIDGE WORK IS TO BE STARTED SOON LAND RATES ARE SKYROCKEDTED IN NAGARKURNOOL SNR NNK BRV

Nagarkurnool: సోమశిల - సిద్దేశ్వరం ప్రాజెక్టు ప్రభావం: ఆ జిల్లాలో భూముల ధరలకు రెక్కలు

Nagarkurnool lands demand

Nagarkurnool lands demand

Nagarkurnool: కృష్ణ నదిపై 800 మీటర్ల మేర కేబుల్ బ్రిడ్జిని, దీనికి అనుసంధానంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 167 జాతీయ రహదారి నిర్మించేందుకు టెండర్లను పిలువనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు దాదాపు 90 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.

ఇంకా చదవండి ...
    (N.Naveen Kumar,News18,Nagarkurnool)
    సోమశిల - సిద్దేశ్వరం ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు
    వడివడిగా ప్రాజెక్ట్ నిర్మాణానికి అడుగులు
    రూ.1200 కోట్లతో అంచనావ్యయం
    రూ.600 కోట్లతో నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక
    హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు తగ్గనున్న 90 కిమీ దూరం
    రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేలా ప్రాజెక్ట్ నిర్మాణం
    కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లాలో భూముల ధరలకు రెక్కలు

    రాష్ట్రాలను రహదారులతో అనుసంధానించేలా కేంద్ర ప్రభుత్వం భారత్ మాల పథకం(Bharat Mala Scheme)తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahbubnagar)జిల్లా పరిధిలో కృష్ణానదిపై వంతెనను నిర్మించి తిరుపతి ప్రయాణానికి మార్గాన్ని సులభతరం చేయనున్నారు. తెలంగాణ(Telangana)లోని నాగర్‌కర్నూల్(Nagarkurnool)జిల్లా కొల్లాపూర్(Kolhapur)నియోజకవర్గం సోమశిల ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని నంద్యాల(Nandyala)జిల్లా సిద్దేశ్వరం(Siddeswaram)వరకు వంతెన నిర్మాణానికి అన్ని ఏర్పాట్లను చేపట్టారు.

    వంతెన నిర్మాణం..
    కృష్ణ నదిపై వంతెన నిర్మించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రహదారి మార్గాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కృష్ణ నదిపై 800 మీటర్ల మేర కేబుల్ బ్రిడ్జిని, దీనికి అనుసంధానంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 167 జాతీయ రహదారి నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వలన హైదరాబాద్ నుంచి తిరుపతి, కర్నూల్ వెళ్లేందుకు దాదాపు 90 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.



    రెండు దశల్లో ప్రాజెక్ట్ నిర్మాణం:
    సోమశిల - సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో చేపట్టనుంది. ప్రాజెక్ట్ మొదటి దశలో భాగంగా ముందుగా జాతీయ రహదారిని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కల్వకూర్తి నియోజకవర్గంలోని కొట్ర గ్రామం నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల వరకు 167వ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.520కోట్లను కేటాయించారు. టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేపట్టింది. ప్రక్రియ పూర్తయితే త్వరలోనే ప్రాజెక్ట్ పనులను ప్రారంభించనున్నారు. ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా 800 మీటర్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల నుంచి ఏపీలోని నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం వరకు కృష్ణ నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లతో అంచనా వేసింది. దాదాపుగా మొత్తం రూ.1200 కోట్లతో సోమశిల - సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టనున్నారు.

    Peddapalli: వరకట్న వేధింపులకు వివాహిత బలి, పెళ్లి కుదుర్చుకుని ముఖం చాటేసిన యువకుడు



    2007లో కృష్ణానదిలో మునిగిన పుట్టి:
    కొల్లాపూర్ మండలలోని సింగపట్నం గ్రామంలో లక్ష్మి నరసింహ్మ స్వామి ఆలయం ఉంది. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రథంపై లక్ష్మి నరసింహ్మ స్వామిని ఊరేగిస్తూ ఎంతో సంబురంగా ఈ కార్యక్రమాలను నిర్వహింస్తారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోనే అత్యంత వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు ఉమ్మడి కర్నూల్ జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే 2007వ సంవత్సరంలో ఈ ఉత్సవాల సమయంలో చోటుచేసుకున్న అపశృతి ఇప్పటికి ఆ ప్రాంత ప్రజలకు ఓ చేదు జ్ణాపకంగా మిగిలిపోయింది.

    పదేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి..
    కర్నూల్ జిల్లా నుంచి సింగపట్నం బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు 60 మంది భక్తులు కృష్ణానదిలో పుట్టిపై బయలుదేరారు. ప్రమాదవశాత్తం పుట్టి మునిగి 60 మంది జలసమాదయ్యారు. ఈ విషాధ ఘటన అప్పట్లో జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సోమశిల -సిద్ధేశ్వరం వంతెన ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్ట్ మంజూరు చేయించారు. అనంతరం 2009లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ప్రాజెక్ట్ నిర్మాణం మరుగున పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2019 నుంచి ఈ అంశం తెరపైకి వచ్చింది.

    Drunk and Drives : రికార్డ్ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు .. ఎన్ని లైసెన్స్ లు ర‌ద్దు చేశారో తెలిస్తే షాక్‌



    భూముల ధరలకు రెక్కలు, గ్రామస్థుల మధ్య భూ తగాదాలు:
    ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకూర్తి, నాగర్ కర్నూల్, కొలల్లాపూర్ ప్రాంతాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు సోమశిల-సిద్ధేశ్వరం మార్గం సులభతరమవడంతో ఇక్కడి నుంచి ప్రయాణాలు కొనసాగనున్నాయి. దీంతో 167వ జాతీయ రహదారి ఆనుకుని ఉండే భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక ఎకరాకు రూ. 2 - 3 కోట్లు వరకు ధరలు నిర్ణయిస్తున్నారు. ఈ ప్రభావంతో గ్రామాల్లో భూ వివాదాలు కూడా పెరిగిపోయాయి. గ్రామాల్లో ఇన్నాళ్ల పాటు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజల్లో గెట్టు పంచాయితీలు చెలరేగాయి. ఒక్క అడుగు భూమికోసం భౌతిక దాడులకు పాల్పడుతూ కేసులతో పోలీసు స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Nagar kurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు