Home /News /telangana /

NAGAR KURNOOL SNAKE BITES ARE INCREASING IN NAGARKURNOOL DISTRICT DMHO WARNS PEOPLE TO TAKE IMMEDIATE MEDICINE NNK ABH BRV

Nagarkurnool: ఆందోళనకరంగా పాము కాటు సంఘటనలు.. ఈ ఏడాదిలో ఇప్పటికే 387 కేసులు..

నాగర్‌కర్నూల్ జిల్లాలో పెరుగుతున్న పాము కాటు సంఘటనలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో పెరుగుతున్న పాము కాటు సంఘటనలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో పాము కాటు సంఘటనలు ఆందోళనకరంగా మారాయి. పంట పొలాల్లో వ్యవసాయ పనులకు వెళుతున్న రైతులే ఎక్కువగా పాము కాటు భారిన పడుతున్నారు. జులై చివరి వారంలో నాగర్‌కర్నూల్ పరిధిలో పాము కాటుకు గురై ఇద్దరు మృతి చెందారు.

  ( N.Naveen Kumar, News 18, NagarKurnool)

  ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో పాము కాటు సంఘటనలు ఆందోళనకరంగా మారాయి. పంట పొలాల్లో వ్యవసాయ పనులకు వెళుతున్న రైతులే ఎక్కువగా పాము కాటు భారిన పడుతున్నారు. జులై చివరి వారంలో నాగర్‌కర్నూల్ పరిధిలో పాము కాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటికే (జులై చివరి నాటికి) 387 పాము కాటు కేసులు నమోదయ్యాయి.

  పాముల సంచారం ఎక్కువైంది: వర్షాలు మొదలైన నేపథ్యంలో చెట్లు, మొక్కలు దట్టంగా పెరుగుతున్నాయి. రైతులు వ్యవసాయ పనులు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే పొలం గట్ల పైనా, పొదల మాటున పాములు సంచరిస్తున్నాయి. రైతులు పాములను గమనించక పోవడంతో ప్రమాదాల భారిన పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి జులై చివరి నాటికి 387 పాము కాటు కేసులు నమోదు కాగా, వాటిలో 274 పాము కాటు బాధితులు జనరల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. వీటిలో జనవరిలో 38, ఫిబ్రవరిలో 39, మార్చిలో 44, ఏప్రిల్ 63, మే 69, జూన్ 61, జులైలో 23 కేసులు వచ్చాయి. జులై 19న నలుగురు, 20న ముగ్గురు, 21న 5 మంది, 23న ముగ్గురు, 25న ఒకేసారి పది మంది పాముకాటుతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పాముకాటుకు గురై 8 మంది మృతి చెందారు.

  వాతావరణ చల్లగా ఉండడంతో పాములు బయటకు వస్తాయి. ఈ క్రమంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో రైతులు పంటలు వేస్తున్నారు. పొలాల గట్లపై దట్టంగా మొక్కలు పెరుగుతున్నాయి. పచ్చని మొక్కలు ఆవాసంగా చేసుకుని పాములు బయటకు వస్తాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. పొలాలు చుట్టూ ఇంటి చుట్టూ పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పాముకాటులు సంభవిస్తున్నాయి.

  పాము కాటు బాధితుల్లో రైతులు, కూలీలు ఎక్కువ:
  పాము కాటుకు గురైన వారిలో ఎక్కువగా రైతులు, వ్యవసాయ కూలీలే ఉన్నారు. పాముకాటు గురైనప్పుడు మూఢనమ్మకాలతో ఆకుపసరు వంటి నాటు వైద్యాన్ని చేయించుకోవడంతో, అది మరింత ప్రమాదకరంగా మారుతోంది. పాము కాటుకు గురైన వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా, సొంత వైద్యం చేయడం వలన ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. పాము కాటు నిర్లక్ష్యం చేయొద్దని పాము కాటు వేస్తే వెంటనే వైద్య సేవలు పొందాలని నాగర్‌కర్నూల్ డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు. అంబులెన్సుకి ఫోన్ చేసి అందుబాటులో ఉన్న ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో యాంటీ స్నేక్ మందు అందుబాటులో ఉంటుందని, సకాలంలో చికిత్సను అందిస్తే పాము కాటు నుంచి ప్రాణాలను రక్షించుకోవచ్చని సుధాకర్ లాల్ తెలిపారు. నాటు మందులు, మూఢనమ్మకాల వలన పాము కారును విస్మరిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటుకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని సుధాకర్ లాల్ చెప్పారు. డీఎంహెచ్ఓ ఫోన్ నెంబర్: 919440489057.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు