Home /News /telangana /

NAGAR KURNOOL SNAKE BITE CASES ARE INCREASING NAGARKURNOOL DISTRICT WOMAN DIED AFTER SNAKE BITE ABH BRV NNK

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో పెరుగుతున్న పాముకాటు ఘటనలు: పాము కాటుతో మహిళ మృతి

పాముకాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో చోటు చేసుకుంది. తలుపునూరు గ్రామానికి చెందిన సురేష్ - రేణుక దంపతులు..తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం రాత్రి భోజనం చేసి

పాముకాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో చోటు చేసుకుంది. తలుపునూరు గ్రామానికి చెందిన సురేష్ - రేణుక దంపతులు..తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం రాత్రి భోజనం చేసి

పాముకాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో చోటు చేసుకుంది. తలుపునూరు గ్రామానికి చెందిన సురేష్ - రేణుక దంపతులు..తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం రాత్రి భోజనం చేసి

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India
    (N.Naveen Kumar, News 18, NagarKurnool)

    పాము కాటుతో మహిళ మృతి: పాముకాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో చోటు చేసుకుంది. తలుపునూరు గ్రామానికి చెందిన సురేష్ - రేణుక దంపతులు..తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం రాత్రి భోజనం చేసి.. ఒకే గదిలో నిద్రించారు. ఈక్రమంలో అర్థరాత్రి రేణుక తలపై ఏదో గుచ్చుకున్నట్లుగా కనిపించడంతో భర్త సురేష్ లేచి చూడడంతో కట్లపాము కనిపించింది. వెంటనే రేణుకను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రేణుక మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఏఎస్ఐ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు.



    విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి:విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జయమ్మ లక్ష్మణుల కుమారుడైన క్షేత్రన్న నాయుడు (19) సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆధారంగా నిలుస్తున్నాడు.గురువారం విటలాపురంలో బంధువుల గృహప్రవేశానికి హాజరైన క్షేత్రం నాయుడు... స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి ఫోన్లో పాటలు వింటూ అనుకోకుండా వాటర్ హీటర్ పట్టుకున్నాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. బంధువులు యువకుడిని వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు.

    రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. అచ్చంపేట ఎస్సై మహేష్ కథనం ప్రకారం లింగోటం గ్రామానికి చెందిన బొల్లెపాకుల బాలరాజు (55) బుధవారం రాత్రి గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన బాలరాజును స్థానికులు వెంటనే అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కోమాల్లోకి వెళ్లిన బాలరాజు చికిత్స పొందుతుండగా.. శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Read this; Rajanna Sircilla: అన్నదమ్ముల మధ్య పోరు తప్పదా!: ఆసక్తిగా ఆ నియోజకవర్గ పాలిటిక్స్ 
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

    తదుపరి వార్తలు