హోమ్ /వార్తలు /telangana /

Nagarkurnool: ప్రజావాణిలో వీడియో గేమ్​ ఆడాడు.. మూల్యం చెల్లించుకున్నాడు..

Nagarkurnool: ప్రజావాణిలో వీడియో గేమ్​ ఆడాడు.. మూల్యం చెల్లించుకున్నాడు..

విద్యుత్ ఉద్యోగి పై చర్యలు, షోకాజ్ నోటీస్

విద్యుత్ ఉద్యోగి పై చర్యలు, షోకాజ్ నోటీస్

నాగర్​కర్నూల్​లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వహిస్తూ ఫోన్లో వీడియో గేమ్ ఆడిన  విద్యుత్ అధికారి జకీర్​ భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (N. Naveen Kumar, News18, Nagarkurnool)

  నాగర్‌కర్నూల్ (NagarKurnool) కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వహిస్తూ ఫోన్లో వీడియో గేమ్ ఆడిన విద్యుత్ అధికారి జకీర్‌ (Vidyut Employee Zakhir)కు ఆ శాఖ తరపున షోకాజ్ నోటీసులు (Show cause notice) అందాయి. ప్రజావాణి (Praja vani) కార్యక్రమంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సెల్‌ఫోన్‌లో వీడియో గేమ్ (Video game) ఆడుతూ మీడియా కంటికి చిక్కాడు. ఈ అంశం పలు మీడియా మాధ్యమాల్లో ప్రసారం కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో శాఖా పరమైన చర్యలు చేపట్టేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది.

  వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 12న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి పూనుకున్నారు. అయితే ఓ పక్క ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగానే విద్యుత్ శాఖ అధికారి జకీర్ జేసీ ఎదురుగా కూర్చొని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తన సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కాడు. అది కాస్త మీడియాకు చేరడంతో జకీర్ పై తీవ్ర విమర్శలు రావడంతో పాటు స్థానికంగా దుమారం రేగింది.

  అనంతరం ఈ వ్యవహారంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ ప్రజావాణిలో వీడియో గేమ్ ఎందుకు ఆడాల్సి వచ్చింది అనే అంశం పైన వివరణ ఇవ్వాల్సిందిగా ఉద్యోగి జకీర్‌కు షోకాజ్ నోటీసులను జారీ చేశారు.

  బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ప్రజావాణిలో ఉద్యోగుల పట్ల నమ్మకాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తించడానికి గల కారణాలను వివరించాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ అంశంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తత పెరిగింది. ప్రజావాణికి సమస్యలతో వచ్చేవారిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవనే భావన మొదలైంది. అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు ఈ ఘటన దోహదపడుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కొనియాడుతున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రజల సమస్యలు ఏళ్ల తరబడి తీరడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Nagarkurnool, Telangana employees

  ఉత్తమ కథలు