(N.Naveen Kumar,News18,Nagarkurnool)
నాగర్ కర్నూల్ జిల్లాలో పనిచేస్తున్న 14 మంది ఏఈఈలకు, నలుగురు ఏడీఈలకు, ఒక డీఈకివిద్యుత్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో విద్యుత్ బిల్లుల వసూలు విషయంలో తేడాలు రావడంతో ఎస్పీడీసీఎల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు షోకాస్ నోటీసులు జారీ చేశామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ ఈ లీలావతి మీడియాకి తెలిపారు.
నాలుగు డివిజన్ల పరిధిలో నెలకు రూ. 9.32లక్షల బిల్లు తేడా వస్తున్నాయని విజులెన్సు శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఈ స్థాయిలో బిల్లులో తేడా వచ్చేందుకు కారణాలేమిటి అనే అంశాలను వివరించాలని అధికారులను ప్రభుత్వం ప్రశ్నించింది.
గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు తండాల్లో విద్యుత్ మీటర్ లేకపోవడం వల్లనే బిల్లులో తేడాలు వస్తున్నాయని ఎస్ఈ లీలావతి మీడియాకు వివరించారు.ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో చాలావరకు మారుమూల గ్రామాల్లోని ప్రజలు మీటర్లు పెట్టుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం తరపున తాము బిల్లులో వచ్చిన తేడాలను సరి చేశామని వివరించారు. మీటర్లు లేని ప్రాంతాల్లో చాలావరకు మీటర్లను అమర్చేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైనా మీటర్లు అమర్చుకునేందుకు నిరాకరిస్తే వారిని చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలావరకు విద్యుత్ శాఖ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టి మీటర్లు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజల్లో అవగాహనకు ఇస్తున్నారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana