హోమ్ /వార్తలు /తెలంగాణ /

కోడిపందేలు అయిపోయాయి.. ఇక పొట్టేలు పందేలు మొదలు..!

కోడిపందేలు అయిపోయాయి.. ఇక పొట్టేలు పందేలు మొదలు..!

పాలమూరులో పొట్టేళ్ల పందేలు

పాలమూరులో పొట్టేళ్ల పందేలు

ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar District) లో జాతరలు జోరుగా నడుస్తున్నాయి. దాదాపుగా అన్ని మండలాల్లో విశిష్టత గల ఆలయాల్లో జాతరలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల్లో ప్రజలు రకరకాల పోటీలను నిర్వహిస్తూ ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Mahbubnagar | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar District) లో జాతరలు జోరుగా నడుస్తున్నాయి. దాదాపుగా అన్ని మండలాల్లో విశిష్టత గల ఆలయాల్లో జాతరలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల్లో ప్రజలు రకరకాల పోటీలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ఆలయ కమిటీ తరఫున నగదు పురస్కారం అందజేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పోటీలు సాధారణంగా అన్ని జాతరలలో చూస్తూనే ఉంటాం. కబడ్డీ పోటీలు, పశువుల బండలాగుడు పోటీలు, కోళ్ల పందాలు ఇలాంటి పోటీలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ ఆలయ నిర్వాహకులు కేవలం వినోదాత్మకంగా మాత్రమే చూడలంటూ సూచిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ఆసక్తికరమైన పందెలుజోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం టిటి దొడ్డి గ్రామంలో నిర్వహించారు. ఎక్కడలేని విధంగా మొదటిసారి ఆసక్తికరంగా ఉండేలా పొట్టేళ్ల పందాన్ని నిర్వహించారు.

అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పందెం గుండ్ల భీమరాయుడు గ్రామంలోని బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండు పొట్టేళ్లను బరిలోకి దించే ఒకదానిపై మరొకటి ఉసిగొలిపి రెండు పోటీపడేలా చేస్తారు. ఈ పోటీల్లోతలపడిన ఏ పొట్టేలు అయితే నెగ్గుతుందో ఆ పొట్టేలుకు నగదు పురస్కారాన్ని అందించారు. టీటీ దొడ్డి గ్రామంలో నిర్వహించిన ఈ పోటీలకు 17 పొట్టేలను తీసుకురావడంతో ఇవన్నీ బరిలో తలబడ్డాయి. పోటీల్లో ప్రథమ బహుమతి కర్నూలు జిల్లా దామగుంట్లకు చెందిన భార్గవ్ కు చెందిన పొట్టేలు సొంతం చేసుకోగా.. ద్వితీయ బహుమతి కర్నూలు జిల్లా ఆదోని మండలం పెకడమురుకు చెందిన సిద్ధార్థ పొట్టేలుకు, తృతీయ బహుమతి హైదరాబాద్ సనత్ నగర్ కు చెందిన కాళీకి చెందిన పొట్టేలుకు, నాలుగో బహుమతి కర్నూలు జిల్లా ఎంబయ్యకు చెందిన చంద్రమౌలికి దక్కాయి.

ఇది చదవండి: జంతుబలిచ్చిన డాక్టర్..? వైద్యంపై నమ్మకం పోయిందా..? అసలు స్టోరీ ఏంటంటే..!

గెలుపొందిన పొట్టేళ్లకు ఆలయ కమిటీ యజమానులు నగదు పురస్కారాన్ని అందజేశారు. మొదటి బహుమతి సాధించిన వారికి రూ. 20,116లు, రెండవ బహుమతికిరూ. 15,116మూడవ బహుమతికి రూ. 10,116, నాలుగో బహుమతికి రూ. 5,116 నగదు పురస్కారాన్ని ఆలయ కమిటీ వారు అందించారు. అయితే ఎక్కడా లేనివిధంగా ఈ ఏడాది కొత్తగా పొట్టేల పందాలను నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలకు వచ్చిన ప్రజలు ఉత్సాహంగా ఈ పోటీలను తిలకించారు. రెండు పొట్టేలు బరిలో నుంచి ఒకదానిపైకి మరొకటి తలబడుతుంటే కేరింతల కొడుతూ ఆహ్లాదకరంగా తిలకించారు.

ఈ పోటీల్లో రెండు దృఢమైన పొట్టేళ్లు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా ప్రవర్తిస్తూ ఒకదాని తలను మరొకటి దాడి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పోటీలపైన జంతు ప్రేమికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ జాతరలో ఆహ్లాదం పొందేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. పోటీల్లో పాల్గొని గెలుపొందిన పొట్టేలకు నగదు పురస్కారాన్ని కూడా అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎక్కడ కూడా జంతు హింసను చేపట్టలేదని కేవలం వినోద్నాత్మకంగానే ఈ ప్రక్రియను చూడాలని ఆలయ కమిటీ ధర్మకర్తలు సూచించారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు