హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: ఆకతాయిలూ బీ అలర్ట్.. మహిళల జోలికొస్తే ఖబడ్దార్..!

Nagar Kurnool: ఆకతాయిలూ బీ అలర్ట్.. మహిళల జోలికొస్తే ఖబడ్దార్..!

X
మహిళలకు

మహిళలకు షీ టీమ్స్ భరోసా

నిత్యం ఏదో ఒక మూలన మహిళలు, బాలికలు చిన్నారులపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో ఫోన్ ద్వారా వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Mahbubnagar (Mahabubnagar) | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

నిత్యం ఏదో ఒక మూలన మహిళలు, బాలికలు చిన్నారులపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో ఫోన్ ద్వారా వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయి. అసభ్యకరమైన మెసేజ్లు ఫోన్లు చేసి అమ్మాయిలను వేధిస్తూ ఉండడంతో వారు షీటిం సిబ్బందిని ఆశ్రయిస్తున్నారు. ఫోన్ ద్వారా వేధింపులు ఎక్కువ పరిచయస్తుల నుండే ఉంటున్నాయని పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో షీ టీం బృందాన్ని న్యూస్18ప్రత్యేక ఇంటర్వ్యూ చేపట్టింది.v ఏఎస్పీ రామేశ్వరరావు, షీ టీం అధికారి విజయలక్ష్మి పలు విషయాలను తెలిపారు.బాధిత మహిళలు ఫిర్యాదులు చేస్తే వాటిని గోప్యంగా ఉంచిఅధికారులు విచారణ చేపట్టి న్యాయం చేస్తామని చెప్పారు.

షీ టీం జిల్లా బృందం అధికారులు మహిళలకు అవగాహన కార్యక్రమం కల్పిస్తున్న క్రమంలోఓ విద్యార్థినితనను రెండేళ్లుగా తన తండ్రి వేధిస్తున్నారని అధికారులకు చెప్పింది. దీంతో అక్కడిపై పోలీసుల కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.జిల్లాలోని మహిళలు విద్యార్థులు చిన్నారులకు ఎదురవుతున్న వేధింపులపై చాలావరకు బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుస్తున్నారు. దీంతో జిల్లా పోలీసులు పోలీస్ శాఖతోపాటు షీటీం, సఖి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తరచూ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా స్కూళ్లు, ఇంటర్ డిగ్రీ కళాశాలకు వెళ్లి వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని బాధితులకు భరోసానిస్తున్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచి వారికి న్యాయం చేస్తామని భరోసాను కల్పిస్తున్నారు.

ఇది చదవండి: నమ్మకానికి సైన్స్ కి తేడా ఇదే..! ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం..!

నాగర్ కర్నూల్ జిల్లాలో మహిళల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు షీ టీం అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టింది. జిల్లాలో 2018లో జూలైలో షీ టీం ఏర్పాటు కాక ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 550అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బాధితులు తమను నేరుగా సంప్రదించాల్సిన అవసరం లేకుండానే కేవలం ఫోన్ ద్వారా ఫిర్యాదును తీసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని పోస్టర్ల సిద్ధం చేశామని పోలీస్ అధికారులు తెలిపారు. బాధితులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు వస్తేనే పరిష్కారం చేపట్టడానికి వీలు ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలో షీ టీమ్స్ సిబ్బంది వస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం మంది తమకు ఫోన్ల ద్వారా వేధింపులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఇది చదవండి: కేటీఆర్ మెచ్చిన స్కూల్ ఇదే..! అంతలా ఏముంది అక్కడ..?

వీరిలో ఎక్కువమంది తెలిసినవారి నుండే వేధింపులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఫోన్లు, మెసెంజర్లు సోషల్ మీడియా ద్వారా ఎదురవుతున్న వేధింపులకు పాల్పడుతున్న వారిలో మైనర్ విద్యార్థుల ఎక్కువగా ఉండడం గమనార్హం. వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ఏడాదిలో షీటీంకు43 ఫిర్యాదులు వచ్చాయని నాగర్ కర్నూల్ ఏఎస్పీ రామేశ్వరరావు న్యూస్ 18కు ప్రత్యేకంగా తెలిపారు. ఈ కేసుల్లో47 మందికి పోలీసులుకౌన్సిలింగ్ ఇచ్చారు. వారందరికీ మహిళల పట్ల ఏ విధంగా ఉండాలి.. వారినివేధిస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయని చట్టాల పైన అవగాహన నిర్వహించామని తెలిపారు. మరో నలుగురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

సగటున నెలకు 12 నుంచి 15 వరకు కేసులు నమోదవుతున్నాయనివివరించారు. అయితే కేసులు వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తే తమ వివరాలను తల్లిదండ్రులకు కూడా తెలియనియకుండా గోప్యంగా ఉంచి న్యాయం చేస్తామని తెలుపుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడమే వేధింపులు చేసేవారికి ధైర్యంగా మారుతుందని, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే అన్ని విధాల రక్షణ కల్పిస్తామని చెప్పుకొచ్చారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు